close
Choose your channels

'అజ్ఞాతవాసి' ట్రైలర్ రివ్యూ

Sunday, January 7, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జ‌న‌వ‌రి 10న ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రానున్న చిత్రం `అజ్ఞాత‌వాసి`. ఈ సినిమా ట్రైల‌ర్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూశారు. ఎట్ట‌కేల‌కు ట్రైల‌ర్ నిన్న అర్ధ‌రాత్రి ఒంటిగంట‌కు విడుద‌లైంది. ఓ వైపు ఆధ్యాత్మికం, కామెడీ, యాక్ష‌న్, ఎమోష‌న్స్ ఇలా అన్ని అంశాలు క‌ల‌గ‌లిసిన సినిమా ఇద‌ని ట్రైల‌ర్‌లో ఎలివేట్ చేశారు.

ఇది మ‌నం కూర్చునే చెట్టు..ప‌చ్చ‌ని చెట్టుని గొడ్డ‌లితోప‌డ‌గొట్టి.. రంపంతో ముక్క‌లు ముక్క‌లుగా కోసి.. బెర‌డును బ్లేడుతో సాన‌బెట్టి.. ఒళ్లంతా మేకులు కొట్టి త‌యారు చేస్తారు. ఎంత హింస దాగిందో క‌దా! అలా మ‌నం కోరుకునే చిన్న సౌకర్యం వెనుక మినీ యుద్ద‌మే ఉంద‌నే డైలాగ్ హీరో ప‌ర్స‌నాలిటీని ఎలివేట్ చేస్తుండ‌గా, హీరో హీరోయిన్‌తో ఆఫీస్‌లో కౌగిలించుకోలేదు..జ‌స్ట్ ప‌ట్టుకున్నానంతే అంటూ త‌న‌దైన కామెడీ స్టైల్‌లో ప‌వ‌న్ చెప్పే డైలాగ్‌..వైలెన్స్ ఈజ్ నాట్ ఎన్ ఆప్ష‌న్ అని ఆది పినిశెట్టి డైలాగ్ చెప్ప‌డంతో త‌న‌లోని విల‌నిజాన్ని ఎలివేట్ చేశారు. వీటితో పాటు కొన్ని యాక్ష‌న్, సాంగ్‌లోని సీన్స్‌ను చూపించారు. మ‌ళ్లీ సైకిలెక్కుతాడా వ‌ర్మా! అని ముర‌ళీశ‌ర్మ అంటే వాడు ఎది ఎక్కినా ప‌ర్లేదు..కానీ మ‌న‌ల్ని ఎక్క‌కుండా ఉంటే చాలు అని రావు ర‌మేష్ అంటాడు. వాడి చ‌ర్య‌లు ఊహాతీతం వ‌ర్మ అని అన్న ముర‌ళీశ‌ర్మ‌తో ద‌ట్స్ ద బ్యూటీ అని రావు ర‌మేష్ డైలాగ్‌తో ట్రైల‌ర్ ముగుస్తుంది.

ప‌వ‌న్ క‌ల్యాణ్‌, కీర్తిసురేష్‌, అను ఇమాన్యుయేల్, ఖుష్బూ, బొమ‌న్ ఇరానీ, రావు ర‌మేష్‌, ముర‌ళీశ‌ర్మ త‌దిత‌రులు న‌టించిన ఈ సినిమా జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. సినిమా విడుద‌ల కోసం అభిమానులే కాదు..ప్రేక్ష‌కులు, ట్రేడ్ వ‌ర్గాలు సైతం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు మ‌రి. ఈ సినిమాతో ప‌వ‌న్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి మ‌రి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.