close
Choose your channels

థియేట‌ర్స్ నిర్మాణంలోకి అజ‌య్ దేవ‌గ‌ణ్‌

Saturday, May 18, 2019 • తెలుగు Comments

థియేట‌ర్స్ నిర్మాణంలోకి అజ‌య్ దేవ‌గ‌ణ్‌

బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్‌కి న‌ట‌న‌తో పాటు సినిమా సంబంధిత వ్యాపారాలు కూడా ఉన్నాయి. ప్రొడ‌క్ష‌న్ హౌస్‌, వి.ఎఫ్‌.ఎక్స్ కంపెనీ .. ఉన్నాయి. ఇప్పుడు వీటితో పాటు ఈ హీరో మ‌రో సినిమా స‌బంధిత వ్యాపారంలోకి అడుగు పెట్ట‌బోతున్నాడు.

ఆ వ్యాపారం ఏదో కాదు.. థియేట‌ర్స్ బిజినెస్‌. 650 కోట్ల రూపాయల‌తో దేశ వ్యాప్తంగా 250 థియేట‌ర్స్‌ను కట్టాల‌ని అజ‌య్ దేవ‌గ‌ణ్ భావిస్తున్నాడ‌ట‌. ముందు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఒక‌టి, ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో 15 థియేట‌ర్స్ క‌డ‌తాడ‌ట‌.

ఇలా క్ర‌మంగా దేశ‌మంతా త‌న థియేట‌ర్స్ ఉండేలా అజ‌య్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ హీరో `తానాజీ` అనే హిస్టారిక‌ల్ చిత్రంతో పాటు.. తెలుగులో 'ఆర్ఆర్ఆర్' సినిమాలో న‌టిస్తున్నాడు. 

Get Breaking News Alerts From IndiaGlitz