close
Choose your channels

నాలుగు నెల‌ల ముందే చెప్పిన బ‌న్నీ...

Thursday, April 9, 2020 • తెలుగు Comments

నాలుగు నెల‌ల ముందే చెప్పిన బ‌న్నీ...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 20వ చిత్రానికి ‘పుష్ప’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ముత్యం శెట్టి మీడియా సంస్థ‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఆర్య‌, ఆర్య 2 చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మూడో చిత్ర‌మిది. ఈ సినిమా కోసం బ‌న్నీ కొత్త లుక్‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడు. చిత్తూరు జిల్లాలోని శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సినిమా తెర‌కెక్కుతోంది. బ‌న్నీ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేశాడ‌ని బ‌న్నీ అభిమానులు సంతోషప‌డుతున్నారు.

కానీ బ‌న్నీ టైటిల్ నాలుగు నెల‌ల క్రిత‌మే అనౌన్స్ చేశాడ‌ని తెలిసి అంద‌రూ షాక‌వుతున్నారు. అదేంటి పుష్ప అనే టైటిల్‌ను బ‌న్నీ నాలుగు నెల‌ల క్రిత‌మే చెప్పాడా? అనే సందేహం క‌లగొచ్చు. వివ‌రాల్లోకెళ్తే.. గ‌త ఏడాది న‌వంబ‌ర్ 27న సుకుమార్‌కు అల్లు అర్జున్ ట్వీట్ పెట్టాడు. ‘‘సుక్కు జుట్టు రంగు మారింది. నా చర్మం కలర్ మారింది. కానీ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ మాలో ఇంకా తగ్గలేదు. దానికి త్వరలోనే మీరు సాక్షులుగా నిలుస్తారు’’ అంటూ పుష్ప టైటిల్‌ను డిఫ‌రెంట్‌గా రాసి పోస్ట్ చేశాడు బ‌న్నీ. ఇప్పుడు ఆ ట్వీట్ చూసినవారు అదేదో డిజైన్ అనుకున్నామే, టైటిలా అని నోరెళ్ల బెడుతున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz