close
Choose your channels

బ‌న్ని నెక్ట్స్ ప్రాజెక్ట్‌

Thursday, June 14, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బ‌న్ని నెక్ట్స్ ప్రాజెక్ట్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.. ఇటీవ‌లే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంతో ప‌ల‌క‌రించారు. ఈ సినిమాలో త‌న పెర్‌ఫార్మెన్స్‌తో అభిమానులనే కాకుండా స‌గ‌టు ప్రేక్ష‌కుల‌ను కూడా అల‌రించారు. ఈ సినిమా విడుద‌లై నెల అవుతున్నా.. బ‌న్నీ చిత్ర‌మేది సెట్స్ పైకి వెళ్ళ‌లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. బ‌న్ని మూడు చిత్రాల‌ను లైన్‌లో పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

ఈ మూడు చిత్రాలు కూడా అగ్ర ద‌ర్శ‌కుల చిత్రాలు కావ‌డం గ‌మ‌నార్హం. విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం, అలాగే సురేంద‌ర్ రెడ్డి డైరెక్ష‌న్‌లో ఓ మూవీ చేసేందుకు బ‌న్ని ప్లాన్ చేసుకున్నార‌ట‌.

వీటిలో ముందుగా విక్ర‌మ్ కె.కుమార్ మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం. స్క్రిప్ట్ వ‌ర్క్ తుదిద‌శ‌లో ఉన్న ఈ సినిమా త్వ‌ర‌లోనే పట్టాలెక్క‌నుంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.