close
Choose your channels

‘జాన్’ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న అమిత్ త్రివేది!

Tuesday, January 7, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘జాన్’ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న అమిత్ త్రివేది!

బాహుబలి స్టార్‌గా ప్రభాస్ ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ యంగ్ రెబల్ స్టార్ చేయబోయే అప్ కమింగ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ‘సాహో’ తర్వాత ‘జాన్’ సినిమాను ప్రభాస్ ఓకే చేశారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 1970ల నాటి ప్రేమకథతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆ పనుల్లో డైరెక్టర్ ‘జిల్’ రాధాకృష్ణ బిజీబిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర కథనం బయటకొచ్చింది. ఈ సినిమా సంగీత దర్శకుడిగా ముందు సైరా ఫేమ్ .. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేదిని అనుకున్నారు. అమిత్ లాంటి స్టార్ డైరెక్టర్ మ్యూజిక్ కంపోజింగ్‌లో ప్యాన్ ఇండియా సినిమా రెడీ అవుతుందన్న ఆలోచనల్లో ప్రభాస్ ఫ్యాన్స్ ఉండగా.. ఆ ప్రొడక్షన్ హౌజ్ నుంచి బిగ్ బ్రేకింగ్ న్యూస్ వెలువడింది. అమిత్ త్రివేది ఈ సినిమా నుంచి తప్పుకున్నారట. ప్రస్తుతం మరో సంగీత దర్శకుడి గురించి ఆలోచిస్తుందట చిత్ర బృందం.

ప్రభాస్ గత సినిమా ‘సాహో’ విషయంలోనూ ఇలాగే జరిగింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘సాహో’ను యు.వి.క్రియేషన్స్, టి-సిరీస్ సంయుక్తంగా నిర్మించాయి. ముందుగా బాలీవుడ్ సంగీత త్రయం శంకర్-ఎషాన్-లాయ్‌తో మ్యూజిక్ చేయడానికి యూవీ క్రియేషన్స్ రెడీ అయ్యింది. అయితే టి-సిరీస్ నో చెప్పడంతో ఆ మ్యూజికల్ ట్రియో పక్కకు తప్పుకుంది. ఇప్పుడు జాన్ విషయంలోనూ అలాంటి పరిస్థితే ఏర్పడింది. అమిత్ త్రివేది పక్కకు జరగడంతో మరో సంగీత దర్శకుడి కోసం రాధాకృష్ణ అండ్ టీమ్ వెదుకులాడుతోందని సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.