బిగ్‌బాస్‌లో ఎంట్రీపై యాంకర్ లాస్య క్లారిటీ
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో ఇప్పటికే రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ‘బిగ్‌బాస్’ షో.. త్వరలోనే మూడవ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ తరుణంలో ఫలానా నటి.. ఫలానా యాంకర్.. ఫలానా నటులు బిగ్‌బాస్‌కు వెళ్తున్నారంటూ పెద్ద ఎత్తున వెబ్సైట్లు, సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అలానే యాంకర్ లాస్య పేరు కూడా వినిపించింది. అయితే తాజాగా ఈ వ్యవహారంపై ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించిన ఆమె ఓ వీడియోను రిలీజ్ చేశారు.
ఇదంతా ఫేక్ న్యూస్..!
తాను బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న వార్తలన్నీ ఫేక్ అని చెప్పడానికే ఈ వీడియోను పోస్ట్ చేశానని లాస్య స్పష్టం చేశారు. తనకు చిన్నబాబు ఉన్నాడని.. బాబుతో గడిపేందుకు తన టైమ్ సరిపోతుందన్నారు. తన బాబుతో గడిపే ఈ టైమ్ మళ్లీ మళ్లీ రాదని..ఈ ఏడాది పూర్తిగా బాబుతోనే గడపాలని అనుకుంటున్నానని లాస్య స్పష్టం చేశారు. అంతటితో ఆగని ఆమె.. ప్రస్తుతానికి బిగ్‌బాస్‌కు వెళ్లే ఆలోచన లేదని.. ఏదైనా ఉంటే నెక్ట్స్ టైమ్ చూద్దామని చెప్పుకొచ్చారు.
నిజమైతే ఎంత బాగుండో..!
అంతటితో ఆగని ఆమె.. మొదట కాసింత ఆట పట్టిస్తూ.. తనపై వార్తలను చదివి వినిపిస్తూ ఆఖరున ఇవన్నీ ఫేక్ న్యూస్ అని నవ్వుతూ చెప్పారు. తాను బిగ్ బాస్‌కు వచ్చేస్తున్నానని.. లాస్య ఎంట్రీ కన్ఫార్మ్ అయిపోయిందని షో ప్రారంభానికి ముందే 30 లక్షల రూపాయలు ఇచ్చేస్తున్నారని నవ్వుతూ చెప్పిన యాంకర్ చివర్లో.. అబ్బా ఇది వినడానికి ఎంత బాగుందో.. కానీ ఇదంతా అబద్ధం. ఇట్స్ ఏ ఫేక్ న్యూస్’ అని లాస్య వీడియోలో స్పష్టం చేసింది. సో.. ఇప్పటికే గుత్తా జ్వాల, సింగర్ హేమచంద్ర, నటి సోభితా ధూళ్లిపాళ్ల క్లారిటీ ఇవ్వగా తాజాగా లాస్య కూడా పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టేసిందన్న మాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.