close
Choose your channels

అలా ఆలోచించి చేసిన సినిమానే బాల‌య్య డిక్టేట‌ర్. - అంజ‌లి

Monday, January 11, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అందం..అభిన‌యం.. ఈ రెండు ఉన్న అతికొద్ది మంది క‌థానాయిక‌ల్లో ఒక‌రు అంజ‌లి. వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంటూ అన‌తికాలంలోనే మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకుని త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త సంపాదించుకుంది. తాజాగా నంద‌మూరి న‌ట సింహం బాల‌క్రిష్ణ స‌ర‌స‌న డిక్టేట‌ర్ సినిమాలో న‌టించింది. సంక్రాంతి కానుక‌గా ఈనెల 14న డిక్టేట‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ సంద‌ర్భంగా డిక్టేట‌ర్ హీరోయిన్ అంజ‌లి తో ఇంట‌ర్ వ్యూ మీకోసం...

బాల‌క్రిష్ణ సినిమాలో హీరోయిన్ గా న‌టించే అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు ఎలా ఫీల‌య్యారు..?

బాల‌క్రిష్ణ గారితో సినిమా అన‌గానే చాలా టెన్ష‌న్ ప‌డ్డాను. పెద్ద హీరో.... సెట్స్ లో ఎలా ఉంటారో..? ఆయ‌న ప‌క్క‌న న‌టించ‌గ‌ల‌నా..? లేదా..? అని చాలా టెన్ష‌న్ ప‌డ్డాను. అయితే ఆయ‌న‌తో న‌టించ‌డం స్టార్ట్ చేసాకా తెలిసింది ఆయ‌న ఎంత మంచివారో. హీరోయిన్ అని నాతోనే కాదు...ఆయ‌న‌తో క‌ల‌సి న‌టించే ఎవ‌రికైనా స‌రే చాలా ఫ్రీడం ఇస్తారు. అలాగే.. ఎలా న‌టిస్తే బాగుంటుందో స‌ల‌హాలు ఇస్తారు. ఆయ‌న‌తో న‌టించ‌డం మ‌ర‌చిపోలేని అనుభూతి.

బాల‌క్రిష్ణ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు..?

ఆయ‌న టైమ్ అంటే టైమ్ కి సెట్స్ కి వ‌స్తుంటారు. సీనియ‌ర్ హీరో అయి టైమ్ ని ఫాలో అవుతుంటారు. ఆయ‌న్ని చూసి క్ర‌మ‌శిక్ష‌ణ‌గా ఉండ‌డం.. టైమ్ ని ఫాలో అవ‌డం నేర్చుకున్నాను.

మిమ్మ‌ల్ని సావిత్రి గారితో పోల్చిన‌ప్పుడు మీకు ఏమ‌నిపించింది..?

ఈ సినిమా ఎడిటింగ్ రూమ్ లో నా సీన్స్ చూసి చాలా మంది చాలా కొత్త‌గా క‌నిపిస్తున్నార‌ని చెప్పారు. ఇక బాల‌క్రిష్ణ గారు నా న‌ట‌నను సావిత్రి గారితో పోల్చిన‌ప్పుడు చాలా హ్యాఫీగా ఫీల‌య్యాను.లెజండ‌రీ ఏక్ట్ర‌స్ సావిత్రి గారితో పోల్చ‌డం అంటే... అంత‌కు మించి కావాల్సింది ఏమంటుంది.

డిక్టేట‌ర్ లో మీ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుంది..?

ఈ సినిమాలో నా క్యారెక్ట‌ర్ ఏమిటనేది చెప్ప‌లేను. ఎందుకంటే క్యారెక్ట‌ర్ పేరు చెప్పినా క‌థ తెలిసిపోతుంది. కాక‌పోతే...ఒక‌టి మాత్రం చెప్ప‌గ‌ల‌ను అది ఏమిటంటే...రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో హీరోయిన్ లా నా క్యారెక్ట‌ర్ ఉండ‌దు. డిఫ‌రెంట్ అంజ‌లి క‌నిపించేలా డైరెక్ట‌ర్ శ్రీవాస్ నా క్యారెక్ట‌ర్ ను డిజైన్ చేసారు. సినిమా చూసిన త‌ర్వాత డిక్టేట‌ర్ లో అంజ‌లి ఓ క్యారెక్ట‌ర్ చేసిందిలే అన‌రు. అంజ‌లి ఓ మంచి క్యారెక్ట‌ర్ చేసింది అంటారు. ఆ విధంగా నా క్యారెక్ట‌ర్ ఉంటుంది.

చాలా స‌న్న‌గా..క్యూట్ గా క‌నిపిస్తున్నారు..కార‌ణం..?

గీతాంజ‌లి, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు..సినిమాల్లో నా క్యారెక్ట‌ర్ వేరు ఈ సినిమాలో నా క్యారెక్ట‌ర్ వేరు. ఈ సినిమాలో వ‌ర్కింగ్ ఉమెన్ గా న‌టించాను. అందుచేత స‌న్నగా క‌నిపించాల‌ని డైరెక్ట‌ర్ శ్రీవాస్ చెబితే ఐదున్న‌ర కేజీలు త‌గ్గాను. అందుచేత స‌న్న‌గా క‌నిపిస్తున్నాను అంతే.

చాలా గ్యాప్ త‌రువాత స్టార్ హీరోతో వ‌ర్క్ చేసారు క‌దా...స్టార్ హీరోతో వ‌ర్క్ చేయ‌డానికి ఇంత‌ గ్యాప్ రావ‌డానికి కార‌ణం ఏమిటి..?

లెజెండ్ సినిమాలో చేయాలి కానీ కొన్ని కార‌ణాల వ‌ల‌న కుద‌ర‌లేదు. ఆత‌ర్వాత ల‌యన్ సినిమాలో చేయాలి అప్పుడు కూడా కుద‌ర‌లేదు. ఫైన‌ల్ గా డిక్టేట‌ర్ క‌థ న‌చ్చింది..డేట్స్ కుదిరాయి చేసాను. అయినా ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేం క‌దా..

తెలుగ‌మ్మాయి హీరోయిన్ అవ్వ‌డం...అదీ...ఇంత‌ లాంగ్ ర‌న్ ఈమ‌ధ్య కాలంలో ఎవ‌రి లేదు అంటే ఏమంటారు..?

తెలుగ‌మ్మాయిని ఇక్క‌డ ప్రొత్సాహస్తున్నారు. అలా ప్రొత్స‌హించ‌డం వ‌ల‌నే ఇన్ని సినిమాలు చేస్తున్నాను. కాక‌పోతే మ‌నం చేసే సినిమాల‌ను బ‌ట్టి లాంగ్ ర‌న్ అనేది ఆధార‌ప‌డి ఉంటుంద‌ని న‌మ్ముతాను. సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్లు సినిమా వ‌చ్చి నాలుగేళ్లు అవుతుంది. ఇప్ప‌టికీ ఆ సినిమాలో సీత క్యారెక్ట‌ర్ గురించి నాతో మాట్లాడుతుంటారు. అలా ఎప్ప‌టికీ గుర్తుండే పాత్ర‌లే చేయాల‌నుకుంటాను. అలా మంచి పాత్ర‌లు సెలెక్ట్ చేసుకోవ‌డం వ‌ల‌నే లాంగ్ ర‌న్ ఉంద‌నేది నా అభిప్రాయం. అలా ఆలోచించి చేసిందే డిక్టేట‌ర్.

మ‌మ్ముటితో త‌మిళ సినిమా చేస్తున్నారు..అలాగే మ‌ల‌యాళ మూవీ కూడా చేస్తున్నారు..స‌డ‌న్ గా స్పీడు పెంచ‌డానికి కార‌ణం ఏమిటి..?

స‌డ‌న్ గా నేను స్పీడు పెంచ‌లేదండి. నా మ‌న‌సుకు న‌చ్చిన క్యారెక్ట‌ర్స్ ఇప్పుడు వ‌రుస‌గా వ‌స్తున్నాయి. అంతే త‌ప్పా..నేను కావాల‌ని ప్లాన్ చేసుకుని స్పీడు పెంచ‌లేదు. ఇక్క‌డో విష‌యం చెప్పాలి మ‌మ్ముటి గారితో చేసే సినిమాలో ట్రాన్స్ జెండ‌ర్ రోల్ చేస్తున్నాని వార్త‌లు వ‌స్తున్నాయి. అందులో ఏమాత్రం వాస్త‌వం లేదు.

కాన్ ట్ర‌వ‌ర్సీస్ లో ఎక్కువ ఉంటున్నారు. మీపై కాన్ ట్ర‌వ‌ర్సీ, రూమ‌ర్స్ వ‌చ్చిన‌ప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది..?

కాన్ ట్ర‌వ‌ర్సీస్ లో ఉండాల‌ని ఎవ‌రు అనుకోరు. హీరోయిన్ అంటే అలాంటివి వ‌స్తుంటాయి. ఇక రూమర్స్ కి నా రియాక్ష‌న్ ఎలా ఉంటుంది అంటే...నేను చాలా సెన్సిటివ్. రూమ‌ర్స్ వ‌చ్చిన‌ప్పుడు త‌ట్టుకోలేను..అలా ఎలా వ‌చ్చిందని ఎక్కువుగా వాటి గురించే ఆలోచిస్తుంటాను. అయితే షూటింగ్ లో ఉన్న‌ప్పుడు రూమ‌ర్స్ గురించి తెలిస్తే..నా మూడ్ అప్ సెట్ అయి షూటింగ్ కి ఇబ్బంది. అందుచేత అలాంటి టైంలో ఫ్రెండ్స్ తో ఫోన్ లో మాట్లాడ‌తాను. వాళ్లు నీపై రూమ‌ర్స్ వ‌చ్చాయంటే...నువ్వు మార్కెట్ లో ఉన్న‌ట్టు అని చెబుతుంటారు. అలా రూమ‌ర్స్ నుంచి కూడా పాజిటివ్ తీసుకుంటాను.

రీసెంట్ గా ఓంకార్ రాజు గారి గ‌ది సీక్వెల్ లో న‌టిస్తున్నార‌ని...త్వ‌ర‌లో ఓంకార్ ని పెళ్లి చేసుకోబోతున్నార‌ని వ‌స్తున్నాయి..నిజ‌మేనా..?

అవునా...ఈ రూమ‌ర్ గురించి నేను విన‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఓంకార్ ని క‌ల‌వ‌లేదు. ఈ రూమ‌ర్ఎలా వ‌చ్చిందో తెలియ‌డం లేదు. దీంట్లో అస‌లు వాస్త‌వం లేదు. నేను రాజు గారి గ‌ది సీక్వెల్ లో న‌టించ‌డం లేదు.

మీకు ఎవ‌రు పోటీ అనుకుంటున్నారు..?

నా ద్రుష్టిలో పోటీ అనేదే లేదండి. పోటీ అనేది మ‌న‌కి మ‌న‌మే క్రియేట్ చేసుకుంటాం. ఎవ‌రి ఇంపార్టెన్స్ వాళ్ల‌కి ఉంటుంది. కాజ‌ల్ చేయాల్సిన పాత్ర కాజ‌ల్ చేయాలి...ఇలియానా చేయాల్సిన పాత్ర ఇలియానా చేయాలి. అందువ‌ల‌న పోటీ అనేది ఉండ‌ద‌ని నా అభిప్రాయం.

బ‌న్ని తో ఐటం సాంగ్ చేస్తున్నార‌ని విన్నాం..నిజ‌మేనా..?

బ‌న్ని సినిమాలో సాంగ్ చేస్తున్నాను. అయ‌తే అది ఐటం సాంగ్ కాదు. స్పెష‌ల్ సాంగ్. స‌రైనోడు సినిమాలో ఆ పాట‌కి, నాకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అది ఏమిట‌నేది స‌రైనోడు సినిమా చూసిన త‌ర్వాత తెలుస్తుంది.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?

మ‌మ్ముటితో చేస్తున్న త‌మిళ సినిమా రేపు షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుంది. అలాగే మ‌మ్ముటితో మ‌ల‌యాళ సినిమా కూడా చేస్తున్నాను. త‌మిళ సినిమా ఒక‌టి చేస్తున్నాను. తెలుగులో రెండు సినిమాలు చేయ‌బోతున్నాను. ప్ర‌స్తుతం డిస్క‌ష‌న్స్ స్టేజ్ లో ఉన్నాయి. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో చెబుతాను.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.