close
Choose your channels

‘అణ్ణాత్త’ షూటింగ్ షురూ..!

Tuesday, March 23, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘అణ్ణాత్త’ షూటింగ్ షురూ..!

ఎట్ట‌కేల‌కు సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ 168వ చిత్రం ‘అణ్ణాత్త’ షూటింగ్ రీస్టార్ట్ అయ్యింది. నిజానికి ఈ సినిమా త‌ర్వాత పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వాల‌నుకున్న ర‌జినీకాంత్‌ అనారోగ్య స‌మ‌స్య‌లు రావ‌డంతో..రాజకీయాల రంగ ప్రవేశం మానుకున్నాడు. అలాగే డాక్టర్స్ రెస్ట్ సూచించడంతో అణ్ణాత్త సినిమా షూటింగ్ వాయిదా ప‌డింది. దాదాపు రెండు నెల‌ల త‌ర్వాత ర‌జినీకాంత్ కాస్త కుదుట‌ప‌డ్డారు. ఇప్పుడు చెన్నైలోని ఓ ప్రైవేటు స్టూడియోలో వేసిన సెట్‌లో ‘అణ్ణాత్త’ షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. ఈ షెడ్యూల్‌లో ర‌జినీకాంత్‌, న‌య‌న‌తార పాల్గొంటున్నారు. ఈ ఏడాది దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించింది.

తెలుగులో ద‌రువు, శంఖం, శౌర్యం చిత్రాల‌తో పాటు త‌మిళంలో వివేగం, విశ్వాసం, వీరం, వేదాళం చిత్రాల‌ను డైరెక్ట్ చేసిన ద‌ర్శ‌కుడు శివ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ నిర్మిస్తోంది. మీనా, ఖుష్బూ, కీర్తిసురేశ్‌, ప్ర‌కాష్‌రాజ్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. దీని తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని సినీ వర్గాల సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.