close
Choose your channels

‘ఆర్ఆర్ఆర్‌’లో మ‌రో ఇద్దరు సూప‌ర్‌స్టార్స్‌

Tuesday, November 24, 2020 • తెలుగు Comments

‘ఆర్ఆర్ఆర్‌’లో మ‌రో ఇద్దరు సూప‌ర్‌స్టార్స్‌

తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా ద‌ర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రెస్టీజియస్‌ మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌స (రౌద్రం ర‌ణం రుధిరం) శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. కోవిడ్‌ లాక్‌డౌన్ ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమాకు రాజ‌మౌళి అండ్ టీమ్ మ‌రింత క్రేజ్‌ను పెంచడానికి నిర్ణ‌యించుకున్నార‌ట‌. అందులో భాగంగా సినిమాలోని పాత్ర‌ల‌ను ఇద్ద‌రు స్టార్ హీరోల‌తో ప‌రిచ‌యం చేయించ‌నున్నార‌ట‌. తెలుగులో పాత్ర‌ల‌ను మెగాస్టార్ చిరంజీవి ప‌రిచ‌యం చేస్తే.. హిందీలో ఆమిర్‌ఖాన్ ప‌రిచ‌యం చేస్తాడ‌ట‌. ఈ సినిమాకు ఇది మ‌రింత యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందన‌డంలో సందేహం లేదు.

ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో పాటు బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగణ్‌, హాలీవుడ్‌ స్టార్‌ ఓలివియా మోరిస్, శ్రియా శ‌ర‌న్‌, స‌ముద్ర‌ఖ‌ని త‌దిరులు న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని రూ.450 కోట్ల రూపాయల భారీ బడ్టెట్‌తో, భారీ ప్యాన్‌ ఇండియామూవీగా రూపొందిస్తున్నారు. ఈ ఫిక్షనల్‌ పీరియాడికల్‌ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా 2021లో విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేసుకుంటున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz