close
Choose your channels

సైరాలో మ‌రో స్టార్ టెక్నీషియ‌న్‌

Monday, July 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సైరాలో మ‌రో స్టార్ టెక్నీషియ‌న్‌

మెగాస్టార్ 151వ చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి` నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. తొలి స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవితాన్ని ఆధారంగా చేసుకుని సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తోన్న హిస్టారిక‌ల్ మూవీ ఇది. ఈ చిత్రంలో అమితాబ్‌, విజ‌య్ సేతుప‌తి, జ‌గ‌ప‌తిబాబు, కిచ్చా సుదీప్‌, అనుష్క‌, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా భారీ తారాగ‌ణం న‌టిస్తున్నారు.

లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ కో్సం ప్ర‌ముఖ బాలీవుడ్ మ్యూజిషియ‌న్ జూలియ‌స్ ప్యాకియంను ర‌ప్పించార‌ట‌. ఇప్ప‌టికే ఈ సినిమాకు బాలీవుడ్ మ్యూజిషియ‌న్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఇప్పుడు బీజీఎం కోసం మ‌రో స్టార్ టెక్నీషియ‌న్‌ను రప్పించ‌డం విశేషం. జూలియ‌స్ బాలీవుడ్‌లో `భ‌జ‌రంగీ భాయ్‌జాన్‌`, `సుల్తాన్‌`, `ధూమ్ 3`, `భార‌త్` వంటి చిత్రాల‌కు ప‌నిచేశారు. తెలుగులో ఆయ‌న ప‌నిచేస్తున్న తొలి చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 2న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్స్ జ‌రుగుతున్నాయ‌ట‌. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.