close
Choose your channels

కొత్త పాత్ర‌లో అను....

Thursday, January 18, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఈ ఏడాది 'అజ్ఞాతవాసి' చిత్రంలో అమాయకమైన అమ్మాయి పాత్రలో దర్శనమిచ్చిన కేరళకుట్టి అనుఇమాన్యుయేల్. ఇప్పుడు అవేశం, దూకుడు స్వభావాలున్న అమ్మాయి పాత్రలో నటించనుంది.

మారుతి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా 'శైలజారెడ్డి అల్లుడు' అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. సెట్స్‌పైకి వెళుతున్న ఈ సినిమాలో చైతు అత్తగా సీనియర్ నటి రమ్యకృష్ణ నటిస్తుంది. ఈ సినిమాలో రమ్య పాత్ర పొగరుతో ఉంటుందట.

ఈమె కూతురిగా కనపడే అనుఇమాన్యుయేల్ పాత్ర సైతం తల్లికి తగ్గట్లుగా పొగరుగానే ఉంటుందట. గ్లామరస్ పాత్రలు చేస్తూ వచ్చిన అను ఇమాన్యుయేల్‌కు ఇలాంటి పాత్ర చేయడం కాస్త కొత్తగానే ఉంటుందనడంలో సందేహం లేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.