close
Choose your channels

అనుష్క క్లారిటీ ఇచ్చేసింది...

Tuesday, May 10, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రస్తుతం బాహుబలి కన్ క్లూజన్ చిత్రీకరణలో బిజీగా ఉన్న అనుష్క శెట్టి ఆ సినిమా పూర్తి కాగానే పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో బాగ్ మతి సినిమాలో నటించనుంది. ఇటీవల సినిమా లాంచనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. భాగ్ మతి కులీ కుతుబ్ షా ప్రేయసి అనేది చరిత్ర చెబుతుంది కాబట్టి ఈ చిత్రం పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనుందని అనుకున్నారు. అయితే బాగ్ మతి ప్రస్తుతం జరిగే థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందనుందని అనుష్క తెలియజేసింది. ఈ చిత్రాన్ని మిర్చి, రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా వంటి చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ నిర్మించనుంది. ఇందులో మలయాళ నటుడు జయరాం, నదియాలు కీలకపాత్రల్లో కనపడనున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.