close
Choose your channels

నాడు అనుష్క - నేడు హన్సిక..!

Saturday, November 26, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బైక్ ని హీరో డ్రైవ్ చేయ‌డం...బ్యాక్ సీటులో హీరోయిన్ కూర్చోవ‌డం కామ‌న్. బ‌ట్ ఫ‌రే ఛేంజ్...హీరోయిన్ బైక్ ని డ్రైవ్ చేయ‌డం...హీరో బ్యాక్ సీటులో కూర్చోవ‌డం తెర పై అప్పుడ‌ప్పుడు చూస్తుంటాం. హీరో గోపీచంద్ ల‌క్ష్యం సినిమాలో ఓ స‌న్నివేశంలో అనుష్క బైక్ డ్రైవ్ చేస్తుంటే గోపీచంద్ బ్యాక్ సీటులో కూర్చుంటారు. ఇప్పుడు మ‌ళ్లీ గోపీచంద్ తాజా చిత్రంలో అలాంటి స‌న్నివేశంలోనే న‌టించారు.
సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె. భగవాన్, జె. పుల్లారావు సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్‌లో పూర్తయింది. ఈ షెడ్యూల్ లో గోపీచంద్, హ‌న్సిక ల‌పై రొమాంటిక్ సీన్స్ చిత్రీక‌రిస్తున్నారు. ఇందులో హ‌న్సిక బైక్ డ్రైవ్ చేస్తుంటే బ్యాక్ సీటులో గోపీచంద్ కూర్చున్నారు. తెర పై ఈ స‌న్నివేశం ఎలా ఉంటుందో చూడాలి..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.