close
Choose your channels

చంద్రబాబును జగన్ ఓడించారని ట్రంప్‌కు కోపం!

Tuesday, February 25, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ పర్యటకు ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డికి ఆహ్వనం రాలేదంటూ సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన ప్రచారం చేస్తున్నారని మంత్రి కురసాల కన్నబాబు చెప్పుకొచ్చారు.

ట్రంప్‌తో ఫోటోలు దిగాలని గానీ.. జాతీయ నేతలతో కలిసి చేతులు ఊపాలని జగన్‌కు లేదన్నారు. జగన్‌ ఎప్పుడూ ప్రజలతో ఉండాలనే కోరుకుంటారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ సిద్ధంగా ఉందన్నారు. చంద్రబాబు భయపడుతున్నారు కాబట్టే ఎన్నికలు జరగకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని కురసాల విమర్శల వర్షం కురిపించారు.

జగన్.. ట్రంప్ పక్కన కూర్చునే వ్యక్తే కానీ..!

‘సోషల్‌ మీడియాలో చూస్తున్నాం. ట్రంప్‌ విమానం దిగగానే చంద్రబాబు ఎక్కడా అని అడిగినట్లు ప్రచారం జరుగుతుంది. అమెరికాలో నన్ను ఓడిస్తానన్న చంద్రబాబు ఇప్పుడేం చేస్తున్నారంటే జోలె పట్టుకొని తిరుగుతున్నారని సమాధానం చెప్పినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. చంద్రబాబు ఆస్తులు ప్రకటించారా అని ట్రంప్‌ అడిగినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. వైయస్‌ జగన్‌కు అమెరికా అధ్యక్షుడి పక్కన కూర్చొని ఫొటోలు తీయించుకోవాలని, జాతీయ నేతల చేతులు పట్టుకొని తిరగాలన్న కోరికలు ఏమీ లేవు. నిరంతరం ప్రజల్లో ఉండాలి.. ప్రజల మనస్సుల్లో నిలిచిపోవాలన్నదే జగన్‌కు కోరిక ఉంటుంది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. జగన్‌కు ట్రంప్‌ ప్రక్కన కూర్చోనే స్థాయి ఉన్న వ్యక్తే.. వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రోజు అమెరికా అధ్యక్షుడు ఇండియాకు వస్తే పొలాలకు తీసుకెళ్లారు’ అని కురసాల చెప్పుకొచ్చారు.

బాబును ఓడించినందుకు ట్రంప్‌కు కోపం!

‘ఇవాళ ట్రంప్‌ దేశానికి వస్తే రాష్ట్రపతికి ఉన్న క్రైటీరియా ప్రకారం 8 మంది సీఎంలను మాత్రమే పిలిచారు. ఇది చంద్రబాబుకు తప్పుగా కనిపించింది. చంద్రబాబును జగన్‌ ఓడించినందుకు ట్రంప్‌కు కోపం వచ్చి ఉంటుంది. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడానికి చంద్రబాబుకు సిగ్గు లేదా?. ఇదే ట్రంప్‌ను ఓడిస్తానని చంద్రబాబు అమెరికా వెళ్లారు. అక్కడ ట్రంప్‌ గెలిచాడు. వైయస్‌ జగన్‌ను ఓడిస్తానని రాష్ట్రమంతా తిరిగితే ఆయనకు 23 సీట్లు వచ్చాయి. దేశమంతా చంద్రబాబు తిరిగి మోదీని ఓడిస్తానన్నారు. చంద్రబాబును జనం ఎక్కడ కూర్చోబెట్టారో మనం చూశాం. ఇప్పుడేమో మోదీతో గొడవ పెట్టుకొని తప్పు చేశామని అంటున్నాడు. నలుగురు ఎంపీలను బీజేపీలోకి వలస పంపించారు. ఇదేం రాజకీయమో అర్థం కావడం లేదు. ఇంత దారుణంగా నాయకులు ఉంటారా..? అని ఆవేదనగా ఉంది. వైయస్‌ జగన్‌ అంటే చంద్రబాబుకు వణుకు పుడుతుంది’ అని మంత్రి కురసాల వ్యాఖ్యానించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.