close
Choose your channels

చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించింది మా అర్ధనారి

Monday, July 11, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అర్జున్ యజత, మౌర్యాని జంటగా భానుశంకర్‌ చౌదరి దర్శకత్వం వహించిన చిత్రం అర్ధనారి`. పత్తికొండ సినిమాస్‌ పతాకంపై కర్లపూడి కృష్ణ, ఎమ్‌.రవికుమార్‌ నిర్మించారు. భరతరాజ్‌ సమర్పకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం రెండో వారంలో కూడా విజయవంతంగా ఆడుతుంది.

ఈ సందర్భంగా దర్శకుడు భానుశంకర్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకు నేను తీసిన చిత్రాలకు పూర్తి భిన్నమైన చిత్రమిది. ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలని పట్టుదలతో ఈ కథ తయారు చేశా. బాధ్యతలేనివాడికి భారతదేశంతో బతికే హక్కు లేదు` అన్న లైన్‌తోపాటు పంచ సూత్రాలు కాన్సెప్ట్‌ జనాలకు బాగా కనెక్ట్‌ అయింది. సినిమా స్ఫూర్తిదాయకంగా ఉందని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. పెద్ద బడ్జెట్‌తో తియ్యాల్సిన ఈ కథను మాకున్ను పరిధిలో నూతన నటీనటులతో తీశాం. ఏ స్టార్‌ హీరో ఈ సినిమాలో నటించడానికి సాహసించలేదు. అర్జున్ యజత హిజ్రా వేషంతోపాటు బాధ్యత గల పౌరుడిగా యాక్టింగ్‌ అదరగొట్టాడని ప్రశంసిస్తున్నారు. అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. నిర్మాతల సహకారం మరువలేనిది`` అని తెలిపారు.

నిర్మాత మాట్లాడుతూ... సినిమా అవుట్‌పుట్‌ చూశాక మేం ఏదైతే అనుకున్నామో అదే నిజమైంది. దర్శకుడి ఎఫర్ట్‌కి 100 శాతం న్యాయం జరిగింది. అన్ని ప్రాంతాల్లోని కలెకక్షన్లు బావున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలు, తెలంగాణాలో పలు ప్రాంతాల్లో సినిమాకు చక్కని ఆదరణ లభిస్తోంది. మహిళ ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన వస్తుంది. రెండో వారంలో కూడా వసూళ్లు బావున్నాయి. చిన్న సినిమాను పెద్ద తరహాలో విజయవంతం చేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం`` అని అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.