close
Choose your channels

తన సొంత నిర్మాణంలో అవికా గోర్ చిత్రం.. రేపే టైటిల్ రిలీజ్

Tuesday, June 29, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ బ్యూటీ అవికా గోర్ తన కెరీర్ లో ఓ కొత్త అడుగు వేసింది. ఇప్పటివరకు హీరోయిన్ గా రాణిస్తున్న అవికా గోర్ ఇకపై సినిమా నిర్మాణంలోకి కూడా దిగనుంది. చాలా రోజుల క్రితమే 'అవికా స్క్రీన్ క్రియేషన్స్' పేరుతో సొంత బ్యానర్ ప్రారంభించినట్లు అవికా ప్రకటించింది.

సొంత బ్యానర్ ప్రకటించడమే కాదు అందులో తొలి చిత్రంలో తానే నటిస్తోంది అవికా. ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో అవికా గోర్, యువ నటుడు సాయి రోనాక్ జంటగా నటిస్తున్నారు.

ఇదీ చదవండి: కాస్త బరువు తగ్గిన నాగ్ హీరోయిన్.. సెక్సీ ఫోజులు వైరల్

మురళి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. జూన్ 30 అంటే రేపు అవికా గోర్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్ రివీల్ చేయనున్నట్లు ప్రకటించింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరక్కుతున్న అవికా గోర్ తొలి ప్రొడక్షన్ వెంచర్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

23 ఏళ్ల అవికా గోర్ చిన్నారి పెళ్లికూతురు టివి సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లోకి ప్రవేశించింది. ఉయ్యాలా జంపాల చిత్రంతో హీరోయిన్ గా మారి అలరించింది. ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో అవికా మెరిసింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.