close
Choose your channels

బాల‌కృష్ణ‌, బోయ‌పాటి.. పొలిటిక‌ల్ మూవీ?

Tuesday, December 5, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన 'సింహా', 'లెజెండ్' చిత్రాలు తెలుగు ఇండస్ట్రీలో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిచిపోయాయో ప‌్ర‌త్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ ద్వయం మరోసారి బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి సిద్ధపడుతోంద‌ని స‌మాచార‌మ్‌. బోయపాటి ఈసారి బాలయ్య కోసం పొలిటికల్ కథని రెడీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ పొలిటికల్ బేస్‌డ్ మూవీ.. 2018 అక్టోబర్ నుంచి షూటింగ్ జరుపుకోనుంది.

అలాగే మార్చి 2019 కల్ల షూటింగ్‌ పూర్తి చేసి.. అదే నెల‌లో సినిమాని థియేటర్లలోకి తీసుకురావడానికి డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారట. 2019 మార్చి అంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే సమయం అది. అందుకే ఎన్నికలకు ముందు ఈ మూవీని రిలీజ్ చేస్తే బాలయ్యకు మంచి పొలిటికల్ మైలేజ్ ఇచ్చిన సినిమాగా నిలిచిపోతుందని డైరెక్టర్ భావిస్తున్నారట.

ఈ సినిమాలో బాలయ్య పోషించబోయే పాత్రకి చాలా వేరియేషన్స్ ఉన్నట్లు.. అలాగే ఆయ‌న్ని కొత్త లుక్ లో చూపించబోతున్నట్లు టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్ప‌టికే.. బోయపాటి స్క్రిప్ట్ రెడీ చేసుకునే పనిలో పడ్డార‌ని తెలిసింది. బాలకృష్ణ కూడా సంక్రాంతికి విడుదల కానున్న 'జై సింహా' మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా తర్వాత తేజ డైరెక్షన్లో మ‌హాన‌టుడు ఎన్టీఆర్ బ‌యోపిక్‌ 'ఎన్టీఆర్'లో నటించనున్నారు. ఈ సినిమా తరువాతే.. బోయపాటి సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అలాగే బోయపాటి కూడా రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్నారు. ఆ మూవీ జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. 2018 దసరాకి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ కార‌ణంగానే.. బాల‌య్య‌, బోయ‌పాటి సినిమాని అక్టోబర్ 2018 ఆఖరి వారంలో ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.