close
Choose your channels

బాల‌కృష్ణ స్వ‌యంగా పిలుస్తున్నాడా?

Tuesday, December 18, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాల‌కృష్ణ స్వ‌యంగా పిలుస్తున్నాడా?

నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ నిర్మిస్తున్న చిత్రం 'య‌న్‌.టి.ఆర్‌'. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుద‌ల‌వుతుంది. అందులో తొలి భాగం 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు' జ‌న‌వ‌రి 9న విడుద‌ల‌వుతుంది. రెండో భాగం 'య‌న్.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం.

కాగా.. ఎన్టీఆర్ ఆడియో, ట్రైల‌ర్‌ డిసెంబ‌ర్ 21న హైద‌రాబాద్ జె.ఆర్‌.సిలో విడుద‌ల‌వుతుంది. ఈ వేడుకకు భారీ సంఖ్య‌లో సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతున్నారు. ఇందులో కొంత మందిని బాల‌కృష్ణ స్వ‌యంగా ఆహ్వానిస్తున్నాడ‌ట‌. అంతే కాకుండా.. మ‌రికొంత మందికి బాల‌య్య స్వ‌యంగా ఫోన్ చేసి కూడా పిలుస్తున్నార‌ని ఇండ‌స్ట్రీలో టాక్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.