close
Choose your channels

2019 వేస‌వికి భార‌తీయుడు2?

Wednesday, November 15, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ద్విపాత్రాభిన‌యంలో ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ రూపొందించిన భార‌తీయుడు చిత్రం ఎంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. త‌మిళంలో ఇండియ‌న్ పేరుతో తెర‌కెక్కిన ఈ సినిమా 1996లో విడుద‌లైంది. లంచంపై ఓ స్వాతంత్య్ర పోరాట యోధుడు సాగించిన పోరాటం నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ అద్భుతంగా న‌టించారు.

కాగా, ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రెడీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్‌మెంట్ జ‌రిగింది. స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌నున్నారు. మార్చిలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నార‌ని.. 2019 వేస‌వికి ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నార‌ని త‌మిళ‌నాట వార్త‌లు వినిపిస్తున్నాయి.

కాగా, ప్ర‌స్తుతం శంక‌ర్.. ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా 2.0 చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ 13న ఈ సినిమాని విడుద‌ల చేయ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.