close
Choose your channels

నా కెరీర్ లో ఇప్పటి వరకు చెయ్యని ఓ డిఫరెంట్ క్యారెక్టర్ 'లవ్ యు అలియా' లో చేస్తున్నాను-నటి భూమిక

Tuesday, May 31, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చందన్‌కుమార్‌, సంగీత చౌహాన్‌ జంటగా సమీస్‌ మ్యాజిక్‌ సినిమా పతాకంపై ఇంద్రజిత్‌ లంకేష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ 'లవ్‌ యు అలియా'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ నెలాఖరులో ఆడియోను రిలీజ్‌ చేసి జూన్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఖుషి, సింహాద్రి, అతడు, మిస్సమ్మ వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్లో అద్భుతమైన క్యారెక్టర్స్‌ చేసిన భూమిక ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది.
తన క్యారెక్టర్‌ గురించి నటి భూమిక మాట్లాడుతూ - ''ఈ చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్‌ చేయడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఇప్పటి వరకు నా కెరీర్‌లో ఇలాంటి క్యారెక్టర్‌ చెయ్యలేదు. డైరెక్టర్‌ ఇంద్రజిత్‌ లంకేష్‌గారు నా క్యారెక్టర్‌ని అద్భుతంగా డిజైన్‌ చేశారు. నా క్యారెక్టర్‌ పవర్‌ఫుల్‌గా వుంటూనే ఎన్నో లేయర్స్‌ కలిగి వుండడం విశేషంగా అనిపిస్తుంది. 'లవ్‌ యు అలియా' విషయంలో నేను చాలా ఎక్సైటెడ్‌గా వున్నాను. చక్కని మెసేజ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ అన్నీ వున్న ఈ సినిమా డెఫినెట్‌గా అందరికీ నచ్చుతుంది'' అన్నారు. భూమిక, సుదీప్‌, సన్నిలియోన్‌ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో చందన్‌కుమార్‌, సంగీత చౌహాన్‌, నికిషా పటేల్‌, రవిచంద్రన్‌, రవిశంకర్‌, షాయాజీ షిండే తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.