close
Choose your channels

‘బిగ్‌బాస్ విన్నర్ అభి.. రన్నర్‌గా సొహైల్..’

Monday, December 14, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘బిగ్‌బాస్ విన్నర్ అభి.. రన్నర్‌గా సొహైల్..’

కొన్ని వారాలుగా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్‌బాస్ షో ముగింపు దశకు వచ్చేసింది. బిగ్‌బాస్ సీజన్ 3కి మాదిరిగానే.. సీజన్ 4కి కూడా.. అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే దగ్గరకు వచ్చేసింది. వచ్చే ఆదివారం(డిసెంబర్ 20) గ్రాండ్ ఫినాలే జరగనుంది. అయితే ఇప్పటికే విన్నర్ ఎవరో ఫిక్స్ అయిపోయింది. రన్నరప్‌తో పాటు మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఎవరు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.

అయితే గ్రాండ్ ఫినాలే కంటే ముందుగానే వికీపీడియా అభిజిత్‌ను విన్నర్‌గా ప్రకటించేసింది. అంతేకాదు రన్నరప్‌ సోహైల్ అని.. మూడో స్థానంలో అఖిల్ ఉంటాడని.. నాలుగో స్థానంలో హారిక.. ఇక చిట్టచివరి స్థానంలో అరియానా నిలిచినట్లు ప్రకటించింది. అభిజిత్ విన్నర్ అవడం ఖాయమని ఎప్పటి నుంచో ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. అయితే రెండో స్థానంలో మాత్రం అఖిల్ నిలుస్తాడని టాక్ నడుస్తోంది. కానీ వికీపీడియా మాత్రం సొహైల్‌కు రెండో స్థానాన్ని కేటాయించి.. అఖిల్‌కు మూడో స్థానాన్ని కట్టబెట్టింది.

ఇక మూడు, నాలుగు స్థానాలు అందరూ ఊహించినవే. దీనిలో ఎలాంటి మార్పూ లేదు. కాగా.. గ్రాండ్ ఫినాలేకు గెస్ట్ ఎవరు వస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. నిన్న మొన్నటి వరకూ సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తారని టాక్ నడిచింది. అయితే తాజాగా మరో పేరు వినిపిస్తోంది. గ్రాండ్ ఫినాలేకు గెస్ట్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ గెస్ట్‌గా వస్తే మాత్రం షో రేటింగ్స్ ఓ రేంజ్‌లో పెరిగిపోతాయనడంలో సందేహం లేదు. ప్రస్తుతం మిస్‌డ్ కాల్స్, హాట్‌ స్టార్ యాప్ ద్వారా ఓటింగ్ ప్రాసెస్ కొనసాగుతోంది. శుక్రవారం(డిసెంబర్ 18) అర్ధరాత్రితో ఈ ఓటింగ్ ప్రక్రియ ముగిస్తుంది. ఆ తరువాత విజేత ఎవరనేది అఫీషియల్‌గా తెలుస్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.