close
Choose your channels

బిగ్‌బాస్ 5 తెలుగు: నలుగురు సేఫ్.. మరో నలుగురు డేంజర్ జోన్‌లో, రేపు ఎలిమినేట్ అయ్యేది ఎవరో..?

Sunday, October 3, 2021 • తెలుగు Comments

బిగ్‌బాస్ 5 తెలుగు: నలుగురు సేఫ్.. మరో నలుగురు డేంజర్ జోన్‌లో, రేపు ఎలిమినేట్ అయ్యేది ఎవరో..?

బిగ్‌బాస్ హౌస్ శనివారం కాస్త సీరియస్‌గా, ఇంకాస్త ఎంటర్‌టైనింగ్‌గా, ఉత్కంఠగా సాగింది. ఈ వారం అతి చేసిన వారికి నాగార్జున క్లాస్ పీకారు. పక్కా ఆధారాలతో వారి తప్పులు తెలుసుకునేలా చేశారు. ఇలాంటివి మరోసారి జరగకుండా చూసుకోవాలని నాగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక నామినేషన్స్‌కి సంబంధించి ఈ రోజు నలుగురు సేఫ్ అవ్వగా.. మరో నలుగురు డేంజర్ జోన్‌లో వున్నారు. మరి ఈ రోజు షో వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.

శనివారం నాడు ఎపిసోడ్ లో ఎప్పటిలానే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు నాగార్జున. వరస్ట్ పర్ఫార్మర్‌గా ఎంపికైన జెస్సీని జైలు నుంచి విడుదల చేయడంతో ఎపిసోడ్ ప్రారంభమైంది. షణ్ముఖ్ తనతో సరిగ్గా మాట్లాడడం లేదని.. కావాలనే పక్కన పెడుతున్నాడని కాజల్ దగ్గర సిరి వాపోయింది. ఆ తరువాత షణ్ముఖ్ తో మీటింగ్ పెట్టింది సిరి. ఈ క్రమంలో షణ్ముఖ్.. అందరూ తనను వాడుకుంటున్నారని అనిపిస్తుందని.. జెస్సీ తనను వాడుకున్నా ఆ ఫీలింగ్ రాదని పరోక్షంగా సిరి వాడుకుంటున్నట్లు కామెంట్ చేశాడు. దీంతో సిరి 'నీ నుంచి ఇలాంటి మాటలు ఊహించలేదు' అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: నలుగురు సేఫ్.. మరో నలుగురు డేంజర్ జోన్‌లో, రేపు ఎలిమినేట్ అయ్యేది ఎవరో..?

ఇక నాగ్ యథావిధిగా సోమవారం నుంచి శుక్రవారం వరకూ హౌస్‌లో జరిగిన పరిణామాలను విశ్లేషిస్తూ ఇంటి సభ్యులకు క్లాస్‌ తీసుకున్నారు నాగార్జున. ముఖ్యంగా కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా హౌస్‌మేట్స్‌ బరువు తగ్గిన దాన్ని ప్రశంసించారు. లోబో యాటిట్యూడ్‌పై నాగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా వరకూ నేను బరాబర్‌ చేసిన.. జనాలకు ఏం నచ్చుతుందో, నచ్చటం లేదో నాకు తెలియదు సర్‌’ అని లోబో అనగా, ‘అరవటం కూడా బరాబర్‌ అంటావా’ అనగా ‘లవ్‌ పదం ఎత్తగానే నాకు కోపం వచ్చింది సర్’ అని లోబో వివరణ ఇచ్చుకునేందుకు ట్రై చేశాడు. ‘నీ ఒక్కడికే ఉందా ప్రేమ మిగతా వాళ్లకు లేదా? అరిచేసి, గొంతు చించుకుని..’ అంటూ లోబో మాట్లాడిన వీడియో ఫుటేజ్‌ను నాగార్జున చూపించారు. మాట్లాడితే బస్తీ నుంచి వచ్చాను.. అంటావు, ఇది బస్తీ కాదు, విల్లా కాదు.. అందరూ ఒక్కటే' అంటూ ఫైర్ అయ్యారు నాగ్.
బిగ్‌బాస్ 5 తెలుగు: నలుగురు సేఫ్.. మరో నలుగురు డేంజర్ జోన్‌లో, రేపు ఎలిమినేట్ అయ్యేది ఎవరో..?

దీంతో దిగివచ్చిన అతడు ఇంటి సభ్యులకు క్షమాపణ చెప్పాడు. ‘ఈ వారం లోబోను చూస్తే నాకు భయం వేసింది. ఒంటరిగా నేను గదిలో ఉన్నప్పుడు లోబో వస్తే వణికిపోయేదాన్ని’ అంటూ నాగార్జున ముందు ప్రియ చెప్పింది. దీనికి ‘బిగ్‌బాస్‌ హౌస్‌ను మించిన సేఫ్ ప్లేస్ మరొకటి లేదు’ అంటూ నాగ్ భరోసా ఇచ్చారు.

ఆ తరువాత కెప్టెన్సీ టాస్క్‌లో పోటీపడ్డ కంటెస్టెంట్స్ అందరికీ బిగ్‌బాస్ రివార్డ్స్ ప్రకటించారు. కొందరికి కేక్, మరికొందరికి మఫిన్స్ ఇచ్చారు. సిరి, షణ్ముఖ్ లను లేచి నిలబడమని చెప్పి వారి ముందు మిర్చీలతో ఉన్న ప్లేట్ ను పెట్టారు. 'తినమ్మా చిన్న ముక్క తిను' అని నాగ్.. షణ్ముఖ్ కి చెప్పగా.. అతడు మిర్చీను తిన్నాడు. 'కూర్చొని కబుర్లు చెప్తున్నావ్ అంతే' అంటూ షణ్ముఖ్ పై పంచ్ వేశారు నాగార్జున. 'నీలో ఉన్న ఫైర్ ని బయటకు తీయడానికి మిర్చి ఇచ్చానని' చెప్పారు. ఆ తరువాత సిరిని ఉద్దేశిస్తూ.. 'నీ ఆట నువ్ ఆడమ్మా' అని అన్నారు. సిరి-షణ్ముఖ్ లను ఉద్దేశిస్తూ.. మీ కారణంగా జెస్సీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాడు అన్నారు నాగ్. అలాగే హౌస్‌లో సీక్రెట్‌గా లవ్‌ ట్రాక్‌ నడుపుతున్న శ్రీరామచంద్ర-హమీదాలను నాగార్జున సరదాగా ఆటపట్టించారు.

అనంతరం నామినేషన్‌లో ఉన్నవాళ్లను గార్డెన్ ఏరియాలోకి పిలిచిన నాగార్జున.. ఇంటి సభ్యుల్లో ఎవరు ఎలా ప్రవర్తిస్తారన్న దానిపై ‘బిగ్‌బాస్‌ యాప్‌ స్టోర్‌’ పేరుతో గేమ్‌ ఆడించారు . యాప్‌ స్టోర్‌లో మైండ్‌ యువర్‌ ఓన్‌ యువర్‌ బిజినెస్‌, వాచ్‌ యువర్‌ టంగ్‌, యూజ్‌ యువర్‌ బ్రైన్‌, సింపథీ గెయినర్‌, అటెన్షన్‌ సీకర్‌ యాప్‌లు ఎవరెవరికి సరిపోతాయో చెప్పమని కోరారు.

బిగ్‌బాస్ 5 తెలుగు: నలుగురు సేఫ్.. మరో నలుగురు డేంజర్ జోన్‌లో, రేపు ఎలిమినేట్ అయ్యేది ఎవరో..?

ఈ టాస్క్ లో రవి 'అటెన్షన్ సీకర్' అనే పదాన్ని ప్రియాంకకు ఇచ్చాడు. ప్రియా 'వాచ్ యువర్ టంగ్' అనే పదాన్ని లోబోకి ఇచ్చింది. సన్నీ 'అటెన్షన్ సీకర్' అనే పదాన్ని కాజల్ కి ఇచ్చాడు. మానస్ ' యూజ్‌ యువర్‌ బ్రైన్‌ ' అనే పదాన్ని లోబోకి ఇచ్చాడు. హమీద ' యూజ్‌ యువర్‌ బ్రైన్‌, ' అనే పదాన్ని సన్నీ కి ఇచ్చాడు. యానీ మాస్టర్ 'అటెన్షన్ సీకర్' అనే పదాన్ని ప్రియాంకకు ఇచ్చింది. కాజల్ 'సింపతీ గైనర్' అనే పదాన్ని లోబోకి ఇచ్చింది. కెప్టెన్సీ టాస్క్‌ సందర్భంగా కాజల్‌ ఆడిన మైండ్‌ గేమ్‌, ఆ తర్వాత మాట్లాడిన మాటలకు ఆమెకు శ్వేతవర్మ‘ వాచ్‌ యువర్‌ టంగ్‌’ యాప్‌ ఇచ్చింది. ‘మైండ్‌ యువర్‌ ఓన్‌ బిజినెస్‌’ యాప్‌ రవికి సరిపోతుందని, తనకు సంబంధించిన అన్ని విషయాల్లో రవి కలగజేసుకుంటున్నాడని జెస్సీ అసహనం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా లోబో లేచి.. తన భార్య ఫాతిమా.. ఏడు నెలల గర్భవతి అని, ఆమెది ఈరోజు బర్త్‌డే అని చెప్పడంతో నాగార్జున ఆమెకు స్పెషల్‌ విషెస్‌ చెప్పాడు. ఇక ఈ వారం ఎపిసోడ్‌లో ప్రియా, రవి, కాజల్, సన్నీ సేవ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ప్రస్తుతం నామినేషన్‌లో సిరి, లోబో, అనీ మాస్టర్, నటరాజ్ మాస్టర్ వున్నారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో రేపటి ఎపిసోడ్‌లో తేలిపోనుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz