close
Choose your channels

బిగ్‌బాస్ 5 తెలుగు : రవికి లహరికి లింక్ పెట్టిన ప్రియ.. మీకూ పిల్లలున్నారంటూ రవి ఫైర్

Tuesday, September 21, 2021 • తెలుగు Comments

బిగ్‌బాస్ 5 తెలుగు : రవికి లహరికి లింక్ పెట్టిన ప్రియ.. మీకూ పిల్లలున్నారంటూ రవి ఫైర్

ఎలిమినేషన్ ముగియడంతో సోమవారం రావడంతో నామినేషన్స్ ప్రక్రియను ప్రారంభించాడు బిగ్‌బాస్. ఇంటిలోని ప్రతి కంటెస్టెంట్ కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాలని.. గ్లాస్‌పై పేరు ముద్రించి దానిని సుత్తితో పగలగొట్టాలని ఆదేశించాడు. దీంతో కంటెస్టెంట్‌ల అసలు రంగు ఏంటో మరోసారి బయటపడింది. ఒకరిపై ఒకరు ఘాటు వ్యాఖ్యలతో హౌస్‌ని వేడెక్కించారు. మరి సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఒకసారి చూస్తే..

హమీద-శ్రీరామచంద్ర హౌస్‌లో ఉన్నవారి గురించి ముచ్చట్లు పెట్టుకున్నారు. ఆ తరువాత రవి.. ప్రియాతో మాట్లాడుతూ.. 'లహరి తనతో క్లోజ్ గా మూవ్ అవుతుందని.. కలిసి ఫుడ్ తిందాం అంటుందని.. బ్యాటరీస్ కలిసి చేంజ్ చేయడం వంటివి చేస్తుందని.. ఇలా చేయొద్దు అని నేను చెప్పలేకపోతున్నా..' అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తరువాత మానస్-కాజల్ కలిసి హమీద-సన్నీలు సరిగ్గా పని చేయరని మాట్లాడుకున్నారు.

ఉదయాన్నే.. హౌస్ మేట్స్ అంతా.. 'ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్' అనే సాంగ్ కి డాన్స్ చేశారు. సన్నీ మంచోడే కానీ పని దొంగ, అటు హమీదా పని చేయదు కానీ ఆర్డర్లు వేస్తుంది అని చిరాకు పడ్డాడు మానస్‌. నాగార్జున ఆదేశం మేరకు మటన్‌ బిర్యానీకి అవసరమైన సరుకులన్నింటినీ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపించాడు. కానీ అది కాజల్‌ మాత్రమే వండాలని మెలికపెట్టడంతో ఆమె ఎట్టకేలకు గరిటె పట్టక తప్పలేదు. విశ్వ బిగ్‌బాస్‌ హౌస్‌కు వచ్చేముందు కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌లో తన పరిస్థితి ఎలా ఉందో షణ్ముఖ్‌ దగ్గర ఎమోషనల్ అయ్యాడు. భార్య, కొడుక్కి ఏమైనా కొందామంటే చేతిలో డబ్బుల్లేవని, నాలుగు నెలల అద్దె కూడా కట్టలేదని వాపోయాడు. కొడుకును స్కూల్‌లో జాయిన్‌ చేయడానికి వెళ్తే డబ్బులు తక్కువున్నాయని సీట్‌ రాలేదు అని కంటతడి పెట్టుకున్నాడు. దీంతో షణ్ముఖ్‌ అతడిని ఓదార్చాడు. హౌస్‌లో షణ్ముఖ్‌ పట్టపగలు నిద్రపోవడంతో కెప్టెన్‌ విశ్వ అతడికి కఠిన శిక్ష విధించాడు. స్విమ్మింగ్‌ పూల్‌లో 21 సార్లు దూకాలని ఆదేశించడంతో షణ్ను తనకు విధించిన శిక్షను పూర్తి చేసేందుకు ప్రయత్నించాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు : రవికి లహరికి లింక్ పెట్టిన ప్రియ.. మీకూ పిల్లలున్నారంటూ రవి ఫైర్

అనంతరం నామినేషన్‌ ప్రక్రియ మొదలుపెట్టాడు బిగ్‌బాస్. అందులో భాగంగా కంటెస్టెంట్లు వాళ్లు నామినేట్‌ చేయాలనుకున్న కంటెస్టెంట్‌ పేరును టైల్‌ మీద ముద్రించి దాన్ని పగలగొట్టాల్సి ఉంటుంది. శ్రీరామచంద్ర - గత వారం గేమ్ లో మానస్ కి తనకు మధ్య గ్యాప్ వచ్చిందని.. దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించినా ఆయన వినలేదని.. హేట్రెడ్ పెంచుకున్నాడని తనను నామినేట్ చేశాడు. ఆ తరువాత రవిని నామినేట్ చేశాడు. సిరి - టాస్క్ లో శ్వేతా తనను ఫిజికల్ హర్ట్ చేసిందని కారణం చెప్పింది. ఆ తరువాత లహరిని నామినేట్ చేస్తూ.. గేమ్ లో యాక్టివ్ గా ఉండడం లేదని చెప్పింది. సన్నీ - ప్రియాను నామినేట్ చేస్తూ.. 'మీరు అన్న ఆ మాటను తీసుకోలేకపోయాను' అంటూ రీజన్ చెప్పాడు. 'ఏం మాట అన్నాను చెప్పు' అని ప్రియా అడగ్గా.. 'మీకు తెలుసు అది.. నాకు రిపీట్ చేయడం ఇష్టం లేదని' సన్నీ చెప్పగా.. వెటకారంగా చప్పట్లు కొడుతూ 'వాటే సేఫ్ ప్లే..! అంటూ కామెంట్ చేసింది. ఆ తరువాత కాజల్ ను నామినేట్ చేశాడు సన్నీ.

నటరాజ్ మాస్టర్ - సిరిని నామినేట్ చేస్తూ.. హౌస్ లో ఉన్నవాళ్లను 'వాడు వీడు అంటుందని' రీజన్ చెప్పాడు. కాజల్ ని నామినేట్ చేస్తూ.. ఆమె 'సెల్ఫిష్' అని అన్నారు. యానీ మాస్టర్ - శ్రీరామచంద్రను, మానస్ లను నామినేట్ చేస్తూ వాళ్లిద్దరూ చాలా స్ట్రాంగ్ అని.. ఫిజికల్ టాస్క్ లలో వాళ్లతో పోటీ పడలేకపోతున్నానని.. వాళ్లు హౌస్ నుంచి వెళ్లిపోతే తనకు ఈజీ అవుతుందని కారణాలు చెప్పింది. యాంకర్ రవి - ముందుగా శ్రీరామచంద్రను నామినేట్ చేశాడు. ఆ తరువాత జెస్సీని నామినేట్ చేస్తూ.. 'ఎన్నిరోజులు చిన్న చెడ్డీలు వేసుకొని ఆ దెబ్బ చూపించి ఇంత మంచి ఫ్లాట్ ఫామ్ ని వేస్ట్ చేసుకుంటున్నావేమో అనిపిస్తుంది' అంటూ రీజన్ చెప్పాడు.

లహరి - ప్రియాను నామినేట్ చేస్తూ.. అసలు మీరెందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారో.. నాకు అర్ధం కావట్లేదు' అని లహరి అనగా.. 'ఎందుకంటే నువ్ హౌస్ లో ఉన్న మగాళ్లతో నువ్ చాలా బిజీగా ఉంటున్నావ్' అని బదులిచ్చింది ప్రియా. 'ఎవరితోనో చెప్తారా..? ప్లీజ్' అని అడిగింది లహరి. దానికి ప్రియా.. 'రవి గారితో బిజీగా ఉన్నావ్.. మానస్ తో బిజీగా ఉన్నావ్..' అని ఆన్సర్ చేసింది. ఆ తరువాత 'నీకు మగాళ్లతో ఎలాంటి సమస్యలు రావని.. విమెన్ తో మాత్రమే సమస్యలుంటాయని' ప్రియా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ తరువాత శ్రీరామచంద్రను నామినేట్ చేసింది. లోబో - ప్రియాంకను నామినేట్ చేస్తూ.. కుకింగ్ మీద ఉన్న ఆసక్తి టాస్క్ లో కూడా ఉండాలంటూ సజెషన్ ఇచ్చాడు. ఆ తరువాత శ్రీరామచంద్రను నామినేట్ చేశాడు. ప్రియాంక సింగ్ - లోబోను నామినేట్ చేసింది. ఆ తరువాత జెస్సీను నామినేట్ చేస్తూ.. తనతో సరిగ్గా మాట్లాడడం లేదని రీజన్ చెప్పింది. మానస్ - శ్రీరామచంద్రను నామినేట్ చేస్తూ.. నెగెటివ్ గా చూస్తే మొత్తం నెగెటివ్ గానే కనిపిస్తుందని అన్నాడు. ఆ తరువాత రవిని నామినేట్ చేశాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు : రవికి లహరికి లింక్ పెట్టిన ప్రియ.. మీకూ పిల్లలున్నారంటూ రవి ఫైర్

వెంటనే లహరి.. 'నేను కెమెరా ముందుకు వెళ్లి రవి బ్రో బర్త్ డే ఉంది.. మా ఇంటి నుంచి వైట్ కలర్ షర్ట్ పంపించండి' అంటూ రిక్వెస్ట్ చేశానని.. తనకు, రవికి మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఉందని తేల్చి చెప్పింది లహరి. ఆ తరువాత రవి మండిపడుతూ.. 'నేను సిరితో లహరి కంటే క్లోజ్ గా ఉంటాను. తననొక ఫ్రెండ్ లా, సిస్టర్ లా భావిస్తాను' అని రవి చెప్తుండగా.. వెంటనే ప్రియా.. 'ఇప్పుడు మీరందరి సపోర్ట్ గురించి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు' అని కామెంట్ చేసింది. అలానే 'లహరి సింగిల్ అని.. తను ఏమైనా చేయొచ్చు.. మిగిలిన వాళ్లకు ఫ్యామిలీస్ ఉన్నాయని' రవిని ఉద్దేశిస్తూ చెప్పగా.. దీనికి రవి అంతెత్తున లేచాడు. 'మీరు రాంగ్ స్టేట్మెంట్స్ ఇక్కడ ఇవ్వడానికి వీల్లేదు' అంటూ అరిచిచెప్పాడు. అదే సమయంలో లహరి కూడా 'మీకు నా గురించి మాట్లాడే రైట్ లేదు' అంటూ ప్రియాపై మండిపడింది.

ఆ తరువాత సన్నీని నామినేట్ చేసింది ప్రియా. ఏదో రీజన్ చెప్తూ ఉండగా.. 'ఒక ఆడపిల్లను అనేముందు ఆలోచించి అనండి. ఒక మనిషి హగ్ చేసుకుంటే బూతు కాదు. ఒక హగ్ రాంగ్ గా ఎలా పోట్రెట్ చేస్తారు' అంటూ మండిపడ్డాడు సన్నీ. వెంటనే రవి మధ్యలో జోక్యం చేసుకుంటూ.. 'మీరు చెప్పే విధానం సరిగ్గా లేదని.. ఈ స్టేట్మెంట్ నా కూతురికి అర్ధమైతే ఏం అనుకుంటుంది. మీకు పిల్లలు ఉన్నారు' అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు . ఆ తరువాత ప్రియా అందరి ముందు మోకాళ్లపై నుంచొని క్షమించని కోరింది. అయినా దానికి లహరి-రవి సంతృప్తి చెందలేదు. ఈ నామినేషన్ ప్రక్రియ రేపటి ఎపిసోడ్ లో కూడా కంటిన్యూ కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz