close
Choose your channels

ఆరని.. ‘రోబో-మనుషులు’ మంటలు..

Wednesday, September 30, 2020 • తెలుగు Comments

ఆరని.. ‘రోబో-మనుషులు’ మంటలు..

ఇవాళ బిగ్‌బాస్‌లో చెప్పుకోదగిన విషయాలేమీ పెద్దగా లేవు. ఒక్క గేమ్‌తో నడిపించారు. ఆ గేమ్‌ కూడా అంత ఆసక్తికరంగా అనిపించలేదు. ఆల్రెడీ గత సీజన్‌లో చూసి ఉండటంతో ఈ గేమ్ అంత మజాను ఇవ్వలేదనే చెప్పాలి. ‘నో మనీ.. నో మనీ’ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. ఆ సాంగ్ ఎందుకు వేశారో.. టాస్క్ చూశాక అర్థమైంది. స్టార్టింగ్ స్టార్టింగే బిగ్‌బాస్ ముద్దుగుమ్మలిద్దరూ అఖిల్ పక్కన చేరిపోయి సందడి చేశారు. అప్పుడు అఖిల్‌ని చూడాలి.. నారీ నారీ నడుమ మురారిలా అనిపించాడు. అఖిల్ ఏదనుకుంటే అదైపోవాలని స్వాతి కోరుకుంది. సొహైల్ దొంగతనాలు ఎలా చేయాలో నేర్పించాడు. అయితే ‘రోబో-మనుషులు’ టాస్క్‌లో చెలరేగిన మంటలు మాత్రం ఇంకా ఆరలేదు. రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ టాస్క్‌లో అనుకున్న మాటల గురించి అభి, సొహైల్‌ల మధ్య చిన్న రచ్చ.. నువ్వు మగాడివా? అంటే నువ్వు మగాడివా? అనుకునే వరకూ వెళ్లింది. మధ్యలో మెహబూబ్ కల్పించుకోవడంతో గొడవ మరింత పెద్దదైంది.

ఆరని.. ‘రోబో-మనుషులు’ మంటలు..

ఆ తరువాత అభి, మెహబూబ్‌ల మధ్య చర్చ. హౌస్ అంతా రచ్చ రచ్చ నడుస్తుంటే అవినాష్ మాత్రం అరియానాతో పులిహోర కలపడం స్టార్ట్ చేశాడు. మరోవైపు అభి, మెహబూబ్‌ల మధ్య రచ్చ క్రమక్రమంగా పెరుగుతోంది. సొహైల్, మెహబూబ్‌ల వీక్‌నెస్‌తో అభి గేమ్ ప్లే చేస్తున్నట్టు అనిపించింది. టాస్క్ ప్రారంభమైంది. గతంలో ఆడించిన గేమ్‌నే ఈసారి కూడా బిగ్‌బాస్ రిపీట్ చేశారు. పై నుంచి కాయిన్స్ పడుతుంటే ఒకొక్కరు ఏరుకుని దాచుకోవాలి. ఎవరు ఎక్కువ కాయిన్స్ సేకరిస్తే వారికి ప్రయోజనం ఉంటుందని బిగ్‌బాస్ చెప్పారు. గేమ్‌ని ఎవరికి వాల్లు ఇండివిడ్యువల్‌గా ఆడుతుంటే అఖిల్, మోనాల్ మాత్రం కలిసి ఆడారు. ఆటలో భాగంగా గొడవలు.. కుమార్ సాయి కాయిన్స్ దొంగిలించిన దివి.. దొంగ అని సొహైల్‌ని కామెంట్ చేయడంతో తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. దొంగతనం అనే మాట మాట్లాడితే అది జనాల్లోకి వెళ్లిపోతుందనేది సొహైల్ వాదన. తను భయపడటంలోనూ తప్పేమీ లేదనిపించింది. ప్రస్తుతం నామినేషన్స్‌లో సొహైల్ ఉన్నాడు. అదేమైనా తనకు నెగిటివ్‌గా మారితే కష్టమనేది అతని భావన కావచ్చు.

ఇక సొహైల్ ఎంతకూ తగ్గకపోవడంతో.. ఇక మెహబూబ్ వెళ్లి సొహైల్‌కి సర్ది చెప్పడానికి ట్రై చేశాడు. గేమ్ అయ్యేంత వరకూ మాట్లాడొద్దని మెహబూబ్ సొహైల్‌కి చెప్పాడు. అరియానా కాయిన్స్‌ని అమ్మ రాజశేఖర్ తీశారు. అయితే తీసింది అమ్మ రాజశేఖర్ అని తెలియడంతో అరియానా కూడా లైట్ తీసుకుంది. అయితే ఎవరికి వాళ్లు టై అప్ గేమ్ ప్లే చేస్తుండటంపై బిగ్‌బాస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో అంతా అలర్ట్ అయ్యారు. ఇక సొహైల్, దివిల మధ్య గొడవలోకి సుజాత ఎంటరవడంతో చిన్న వాగ్యుద్ధం నడిచింది. దీనిపై సొహైల్, సుజాతను కలిసి క్లారిటీ ఇచ్చాడు. ఇక మోనాల్ వచ్చి.. నోయెల్‌ని పాంపర్ చేస్తుంటే అభి ఓ లుక్ ఇచ్చాడు. మొత్తానికి ఇవాళంతా కాయిన్ గేమ్‌తోనే షోని బిగ్‌బాస్ నడిపించారు. రేపు కూడా ఈ గేమ్ కొనసాగనుందని ప్రోమోను బట్టి తెలుస్తోంది.

Get Breaking News Alerts From IndiaGlitz