close
Choose your channels

ఆకట్టుకునే పిక్స్.. కదిలించే సంఘటనలు..

Friday, October 16, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆకట్టుకునే పిక్స్.. కదిలించే సంఘటనలు..

మెగాస్టార్ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. అవినాష్‌కి మోనాల్ టిఫిన్ తినిపిస్తుంటే... అమ్మ రాజశేఖర్ సెటైర్లు చాలా ఫన్నీగా అనిపించాయి. లగ్జరీ బడ్జెట్ టాస్క్. స్విమ్మింగ్ పూల్‌లో డాబర్ రియల్ మ్యాంగో డ్రింక్ ఉంటుంది. దాన్ని బయటకు తీసుకొచ్చి తాగాలి. మొదట ఈ టాస్క్‌ను కుమార్ సాయి, మెహబూబ్ స్టార్ట్ చేశారు. మెహబూబ్ 7 బాటిల్స్, కుమార్ 6 బాటిల్స్ తాగారు. దీంతో లగ్జరీ బడ్జెట్ టాస్క్ ముగిసింది. సొహైల్, అరియానాను పిలిచి కూర్చోబెట్టి సారీ చెప్పి నూడిల్స్ తినిపించడం చాలా ఆసక్తికరంగా అనిపించింది. సొహైల్‌లో చాలా మార్పు అయితే కనిపిస్తోంది. తరువాత అరియానా అవినాష్ దగ్గరకు వెళ్లి సొహైల్ ఏం చెప్పాడో చెప్పింది. సొహైల్ నీ విషయంలో తప్పు చేశానని ఫీల్ అవుతున్నాడు అని చెప్పాడు. మోనాల్ విషయంలో నేను ఫుల్ చేంజ్ అయ్యానని అభి.. హారిక, నోయెల్‌కు చెప్పాడు. మాస్టర్ త్వరగా ఫ్లిప్ అవుతారని నోయెల్ కామెంట్.

లోపల దాగి ఉన్న ఫ్రస్టేషన్ పోవడానికట.. గట్టిగా అరిచి.. జెర్సీలో నానిని గుర్తు చేశారు. అభి, కుమార్ సాయి మాత్రం సైలెంట్‌గా ఉండిపోయారు. స్టేజ్ 5 అంటూ అభి కామెంట్. చూస్తుంటేఇలాంటి కామెంట్స్ చేయడం అభికి ఇమేజ్‌కి డామేజ్‌గా మారతాయేమో అనిపిస్తోంది. ఇక ఓల్డ్ మెమొరీస్. అంతా బాగా ఎగ్జైట్ అయ్యారు. ఫోటోలు చూస్తూ కొందరు కంటెస్టెంట్స్ కుళాయి విప్పేశారు. అందరికీ వాళ్ల ఫ్యామిలీ పిక్స్ పంపించారు. ఇక తమ చిన్ననాటి పిక్స్‌తో తమను కదిలించిన విషయాలను మిగిలిన హౌస్‌మేట్స్ పంచుకున్నారు. మొదటగా అరియానా.. తన అసలు పేరు అర్చన అని.. తమ తల్లిదండ్రులు లవ్ మ్యారేజ్ చేసుకున్నారని.. తన చిన్నప్పుడే తమ తల్లిదండ్రులు విడిపోయారని మగ దిక్కులేని సంసారాన్ని అతి కష్టం మీద తమ తల్లి నెట్టుకొచ్చిందని చెప్పుకొచ్చింది. తరువాత మోనాల్.. తన ఫ్యామిలీని చాలా ఇష్టపడతానని చెప్పింది. సొహైల్.. తన తండ్రి సింగరేణి బొగ్గు గనిలో పని చేస్తాడని చెప్పాడు. తన తండ్రి సింగరేణి ముద్దు బిడ్డ అని అతి కష్టం మీద ఆయన తమ ఐదుగురు సోదరులను పెంచారని చెప్పుకొచ్చాడు.

ఆకట్టుకునే పిక్స్.. కదిలించే సంఘటనలు..

మహబూబ్.. గుంటూరులో తమది కూరగాయల షాప్ అని.. చాలా పూర్ అని.. ఇక కుటుంబం గడవడం కోసం తన తమ్ముడు డెసిషన్ తీసుకుని కూరగాయల మార్కెట్‌లో పని చేసి.. తమ తల్లిదండ్రులు, తమ్ముడు తనను ఇంజినీరింగ్ పూర్తి చేయించారని చెప్పాడు. ఈ ముగ్గురి వల్లే తాను ఈ స్థితిలో ఉన్నానని చెప్పుకొచ్చాడు. తరువాత లాస్య.. తన తండ్రి రైతు అని.. తన తల్లి నిండు గర్భిణిగా ఉన్నప్పుడు గడ్డి కోసేందుకు వెళితే అప్పుడే పురిటి నొప్పులు వచ్చాయని.. అయినా అలాగే గడ్డిమోపు తీసుకొచ్చి ఇంటికి వచ్చిన కాసేపటికే డెలివరీ అయి తాను పుట్టానని చెప్పుకొచ్చింది. ఇక అమ్మ రాజశేఖర్.. తన తల్లి అంటే చాలా ఇష్టమని అందుకే ప్రతిదానికి అమ్మ పేరు పెట్టుకుంటానని చెప్పుకొచ్చారు. తన తల్లి అనారోగ్యంతో మృతి చెందిందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా అమ్మ రాజశేఖర్ డబ్బు ముఖ్యం కాదని.. మనుషులే ముఖ్యమంటూ ఓ వండర్ ఫుల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. తరువాత నోయెల్.. తన తల్లి ఫోర్స్ మీద తాము పల్లెటూరు నుంచి పట్నానికి వచ్చామని..తన తల్లి ఇళ్లలో పనులు చేసేదని.. తన తండ్రి రిక్షా తోలేవాడని చెప్పాడు. తన తండ్రి చిరంజీవి ఫ్యాన్ అని ఆయన కారణంగానే సినిమాల్లోకి వచ్చానని చెప్పాడు.

ఆకట్టుకునే పిక్స్.. కదిలించే సంఘటనలు..

హారిక.. తన లైఫ్‌లో ఏం జరిగినా ఇంటర్ లైఫ్‌ని గుర్తు పెట్టుకుంటానని చెప్పింది. ఒకసారి తన తల్లి కాల్ చేసి అమ్మమ్మ ఇంటికి రమ్మని చెప్పిందని.. వెళితే నేను, డాడి సెపరేట్ అవుతున్నామని.. కొద్దిరోజులు డాడీతో ఉండమని తనకు, అన్నయ్యకు చెప్పారని చెప్పుకొచ్చింది. కొద్ది రోజులకే తన తల్లి దగ్గరకు తన అన్నయ్య, తాను వెళ్లిపోవాల్సి వచ్చిందని హారిక చెప్పుకొచ్చింది. అయితే అఖిల్, అభి, దివిల గురించి మాత్రం చూపించలేదు. తరువాత దొంగ చాటుగా లాస్య, హారిక పిస్తా తింటుంటే అఖిల్ సైలెంట్‌గా వెళ్లి భయపెట్టడం.. వాళ్ల ముగ్గురూ కూర్చొని పిస్తా తింటూ ఆటాడుతుంటే నోయెల్ వచ్చి భయపెట్టాడు. నలుగురూ కలిసి సీక్రెట్‌గా లిక్విడ్ చాక్లెట్‌ను లేపేస్తుంటే దివి వచ్చింది. అంతా కలిసి మ్యాంగో డ్రింక్‌ని తాగి ఎంజాయ్ చేయడం ఆకట్టుకుంది. మొత్తం మీద నేటి షో కంటెస్టెంట్ల కదిలించే సంఘటనలతో సాగిపోయింది. ఇక రేపటి టాస్క్‌లో అవినాష్‌కి ఏదో దెబ్బ తగిలినట్టు కనిపిస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.