close
Choose your channels

ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్: బాల రాముడు యంగ్ టైగర్ ఎలా అయ్యాడు ?

Thursday, May 20, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్: బాల రాముడు యంగ్ టైగర్ ఎలా అయ్యాడు ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు 38వ పడిలోకి అడుగుపెట్టాడు. కోవిడ్ కారణంగా తన బర్త్ డేని సెలెబ్రేట్ చేయవద్దని ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని అభిమానులకు ఎన్టీఆర్ సూచించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో మాత్రం ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా తన సినీ ప్రయాణంలో మైలురాళ్ళని గుర్తు చేసుకుందాం.

ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్: బాల రాముడు యంగ్ టైగర్ ఎలా అయ్యాడు ?

బాల రాముడిగా

బాల్యంలోనే ఎన్టీఆర్ నటుడిగా ఓనమాలు దిద్దుకున్నాడు. 1996లో బాలరామాయణంలో రాముడి పాత్రలో అందరినీ మెప్పించాడు.

ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్: బాల రాముడు యంగ్ టైగర్ ఎలా అయ్యాడు ?

తొలి ప్రయత్నం నిరాశే

ఇక హీరోగా తన కెరీర్ ప్రారంభించడానికి ఎన్టీఆర్ ఎక్కువ సమయం తీసుకోలేదు. నూనూగు మీసాల వయసులోనే 'నిన్ను చూడాలని' అనే చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. విఆర్ ప్రతాప్ దర్శత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం నిరాశనే మిగిల్చింది.

ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్: బాల రాముడు యంగ్ టైగర్ ఎలా అయ్యాడు ?

స్టూడెంట్ నెం 1 గా

ఆ తర్వాత రాజమౌళి దర్శత్వంలో తెరకెక్కిన స్టూడెంట్ నెం 1 చిత్రం ఎన్టీఆర్ కు తొలి విజయాన్ని అందించింది. ఇక్కడి నుంచే ఎన్టీఆర్ జైత్ర యాత్ర మొదలైందని చెప్పాలి.

ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్: బాల రాముడు యంగ్ టైగర్ ఎలా అయ్యాడు ?

ఇండస్ట్రీని షేక్ చేస్తూ..

స్టూడెంట్ నెం 1 తో తొలి విజయం రుచి చూసిన ఎన్టీఆర్ ఇక రెచ్చిపోయాడు. వివి వినాయక్ దర్శత్వంలో తెరకెక్కిన ఆది ఘనవిజయంగా నిలిచింది. ఈ కుర్రాడిలో టన్నుల కొద్దీ సత్తా ఉందని అందరికీ తెలిసేలా చేసింది. మరోసారి ఎన్టీఆర్ తో రాజమౌళి చేతులు కలిపాడు. వీరిద్దరి రెండవ కాంబోలో వచ్చిన సింహాద్రి ఇండస్ట్రీని షేక్ చేస్తూ అఖండ విజయం అందుకుంది. ఇంకేముంది ఎన్టీఆర్ టాప్ లీగ్ లోకి దూసుకుపోయాడు.

ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్: బాల రాముడు యంగ్ టైగర్ ఎలా అయ్యాడు ?

కొన్ని పరాజయాలు

సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ కు కొన్నేళ్ల పాటు కలసి రాలేదు. కొన్ని ఫ్లాప్ చిత్రాలు ఎదురయ్యాయి. కృష్ణ వంశీ దర్శత్వంలో వచ్చిన రాఖీ చిత్రం కంటెంట్ పరంగా ఒకే అనిపించింది. కానీ ఎన్టీఆర్ లుక్స్ విషయంలో విమర్శలు వచ్చాయి.

ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్: బాల రాముడు యంగ్ టైగర్ ఎలా అయ్యాడు ?

మళ్ళీ రాజమౌళినే

ఎన్టీఆర్ కెరీర్ ట్రాక్ తప్పుతోంది అనుకుంటున్న తరుణంలో సరైన సమయంలో మరోసారి రాజమౌళి వచ్చాడు. లుక్స్ పరంగా ఎన్టీఆర్ ని కంప్లీట్ గా మార్చేశాడు. సరికొత్త గెటప్ తో యమదొంగలో ఎన్టీఆర్ చెలరేగిపోయి నటించాడు. యమదొంగ చిత్రం తర్వాత తన తాతయ్య ఎన్టీఆర్, బాబాయ్ బాలయ్య తరహాలో జూ. ఎన్టీఆర్ కూడా పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించాలనే డిమాండ్ అభిమానుల్లో బలంగా పెరిగింది.

పక్కా ప్లానింగ్ తో

యమదొంగ తర్వాత ఎన్టీఆర్ పక్కా ప్లానింగ్ తో తన కెరీర్ ముందుకు నడిపిస్తున్నాడు. కథల ఎంపికలో పరిపక్వత చూపిస్తున్నాడు. లుక్స్ పరంగా కేర్ తీసుకుంటూ పర్ఫెక్ట్ ఫిజిక్ మైంటైన్ చేస్తున్నాడు.

ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్: బాల రాముడు యంగ్ టైగర్ ఎలా అయ్యాడు ?

ఎలాంటి పాత్ర అయినా రెడీ

జై లవకుశ, అరవింద సమేత, టెంపర్ లాంటి చిత్రాలు గమనిస్తే తనకు ఎంతటి ఛాలెంజింగ్ రోల్ అయినా వెన్నతో పెట్టిన విద్య అన్న తరహాలో ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు.

ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్: బాల రాముడు యంగ్ టైగర్ ఎలా అయ్యాడు ?

తదుపరి లక్ష్యం పాన్ ఇండియా

ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శత్వంలో ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దేశం మొత్తం ఎదురుచూస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నాడు. ఈ చిత్రం ఎలాగు ఎన్టీఆర్ కి పాన్ ఇండియాలో క్రేజ్ తెచ్చిపెడుతుంది. అందుకే ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్ట్స్ ని పాన్ ఇండియా లెవల్ లో ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఎన్టీఆర్ తన కెరీర్ లో మరిన్ని మైలురాళ్లు అందుకోవాలని కోరుకుంటూ అతడికి ఇండియా గ్లిట్జ్ టీమ్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.