close
Choose your channels

వైఎస్ జగన్- కేసీఆర్ కింగ్ మేకర్స్ అవుతారా..!?

Thursday, January 17, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైఎస్ జగన్- కేసీఆర్ కింగ్ మేకర్స్ అవుతారా..!?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డి, టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వేదికగా చక్రం తిప్పబోతున్నారా..? కేసీఆర్‌ ఫ్రంట్‌‌‌కు రోజురోజుకు బలం పెరుగుతోందా..?. ఇప్పటికే పలువురు ప్రముఖ పార్టీల అధినేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసిన కేసీఆర్ ఇకపై మరింత జోరు పెంచుకునున్నారా..?. బీజేపీ-కాంగ్రేసేతర పార్టీలన్నీ కేసీఆర్‌‌కు సపోర్ట్ చేస్తాయా..? వైఎస్ జగన్‌తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ సక్సెస్ అయ్యిందా..? ఇలాంటి ఆసక్తికర విషయాలు ఈ కథనంలో చూద్దాం.

వైఎస్ జగన్ పాదయాత్రలో ఉన్నప్పుడే భేటీ కావాలనుకున్న కేటీఆర్‌‌.. బుధవారం నాడు ఎట్టకేలకు ఆయనతో భేటీ అయ్యి సుమారు అరగంటకు పైగా ఫ్రంట్‌‌తో పాటు పలు విషయాలపై నిశితంగా చర్చించినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం జగన్ మాట్లాడుతూ.. కేసీఆర్ నేతృత్వంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును స్వాగతిస్తున్నామని చెప్పుకొచ్చారు. రాష్ర్టాల హక్కులను కాపాడటానికి, ఏపీకి ప్రత్యేక హోదా సాధించడానికి ప్రాంతీయ పార్టీలన్నీ ఒకే వేదిక మీదికి రావడం ఎంతో అవసరముందన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఏపీ ఎంపీలకు తెలంగాణ ఎంపీలు తోడైతే సంఖ్య పెరుగుతుందని.. తద్వారా ప్రత్యేక హోదా డిమాండ్‌కు బలం పెరుగుతుందని చెప్పారు. త్వరలో సీఎం కేసీఆర్‌తో సమావేశమై మరింత విస్తృతంగా చర్చిస్తామన్నారు. ఇప్పటి వరకూ జగన్‌‌ ఓకే మరి ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఇదే మాట అంటారా అంటే ఆలోచించాల్సిన విషయమే.

అయితే మొదట్నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న జగన్.. సాధన దిశగా మరో అడుగు ముందుకేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ భేటీని తెలుగు తమ్ముళ్లు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూ మీడియా గొట్టాల ముందుకొచ్చి జగన్‌‌పై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. అనవసరం జగన్ తప్పటడుగులు వేస్తున్నారని పలువురు వైసీపీ నేతలు అసంతృప్తిలో ఉన్నారని తెలిసింది. వైఎస్ జగన్‌‌కు జాతీయస్థాయిలో నేతలతో పెద్దగా టచ్‌‌ కూడా లేదు. ఈ ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తే వాళ్లే తన దగ్గరికి వచ్చేలా చేసుకోవాలని జగన్ భావిస్తున్నారట. మరోవైపు శత్రువు.. శత్రువును తాను మిత్రుడిగా చేసుకున్నానని ఇది ఫ్రంట్‌‌లో మొదటి విజయమని కేసీఆర్‌ అనుకుంటున్నారట. అయితే ఇప్పటికే పలువురు జాతీయస్థాయి పెద్దలను కలిసిన కేసీఆర్.. త్వరలోనే మరోసారి ప్రాంతీయ పార్టీల అధినేతలతో చర్చిస్తారని.. అవసరమైతే జగన్‌‌ను తనకుండా తీసుకెళ్తారని సమాచారం. 

కింగ్ మేకర్స్ అవుతారా..?

తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలుండగా.. ఏపీలో 25 ఎంపీ స్థానాలున్నాయి. వీళ్లిద్దరూ కలిస్తే అటు ఏపీ.. ఇటు తెలంగాణ ఎంపీలంతా ఒక్కటయితే మనమే ఢిల్లీలో కింగ్‌‌లు అవుతామని కచ్చితంగా జాతీయ పార్టీల మెడలు వంచి హక్కులు సాధించుకోవాలన్నదే జగన్, కేసీఆర్ కల. మరీ ముఖ్యంగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి సరైన బలం కావాలని యోచిస్తున్న కేసీఆర్ ఉన్న 17పార్లమెంట్ స్థానాల్లో కచ్చితంగా కనీసం 15కు తగ్గకుండా గెలిస్తే.. అక్కడ జగన్ పార్టీ 25మందిలో కనీసం 20 నుంచి 22 వరకు స్థానాల్లో గెలిస్తే మాత్రం వీరిద్దరూ కూడా ఢిల్లీలో కచ్చితంగా చక్రం తిప్పి కింగ్ మేకర్స్ అవుతారని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కచ్చితంగా ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో సత్తా చాటాల్సిన అవసరం టీఆర్ఎస్, వైసీపీకి ఎంతైనా ఉంది. అయితే ఏడాదికి పైగా ఏపీలో చేసిన పాదయాత్ర, నవరత్నాలు, చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత తనకు ప్లస్ అవుతుందని జగన్ భావిస్తున్నారు. అయితే సీఎం కావాలనకుంటున్న జగన్ కలలు.. ఏ మేరకు నిజమవుతాయో వేచి చూడాల్సిందే.

చంద్రబాబు సంగతేంటి..?

తెలంగాణ ఎన్నికల్లో ప్రజా కూటమి అంటూ చంద్రబాబు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అయితే ఆ కూటమి కుప్పకూలింది.. ఆ విషయాలు ఇక్కడ అప్రస్తుతం. "దేశంలో ఉండే రాజకీయ నేతల్లో నేనే సీనియర్‌ని.. రెండు సార్లు ప్రధాని పదవిని వద్దనుకున్నా.. ఎంతోమందిని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టాను. కచ్చితంగా ఈసారి కూడా చక్రం తిప్పుతాను" అని చంద్రబాబు గట్టిగా అనుకుంటున్నారు. అయితే పక్కరాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌నే ఒప్పించలేకపోతున్న చంద్రబాబు ఇక దేశ రాజకీయ రాజకీయాల్లో ఏ మేరకు చక్రం తిప్పుతారు..? తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తున్న జగన్-కేసీర్, చంద్రబాబు వీరిలో ఎవరు కింగ్ మేకర్ అవుతారు..? ఎవరు జాతీయ స్థాయిలో రాజకీయాలను శాసిస్తారనే విషయాలు తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.