close
Choose your channels

ఈసారి కేథరిన్ రానున్న బ్రేక్ ఎలాంటిదో...

Thursday, August 10, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కేథ‌రిన్ తెలుగులో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. అల్లుఅర్జున్‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన స‌రైనోడుతో స‌రైన విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది కేథ‌రిన్ ట్రెసా. ఆ చిత్రంలో చేసిన ఎం.ఎల్‌.ఎ పాత్ర‌తో మంచి గుర్తింపునే తెచ్చుకుంది. అయితే రీసెంట్‌గా విడుద‌లైన గౌత‌మ్‌నంద అమ్మ‌డికి ఆశించిన విజ‌యం ఇవ్వ‌లేదు.

దీంతో ఇప్పుడు కేథ‌రిన్ ఇప్పుడు త‌న ఆశ‌ల‌న్నింటిని రానున్న త‌న రెండు చిత్రాల‌పై భారీ ఆశ‌ల‌నే పెట్టుకుంది కేథ‌రిన్‌. ఆ చిత్రాలు నేనే రాజు నేనే మంత్రి, జ‌య‌జానకినాయ‌క‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ రెండు చిత్రాలు ఒకే రోజు విడుద‌ల అవుతుండ‌టం. నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో కేథ‌రిన్ రెండో హీరోయిన్ పాత్ర‌లో న‌టించింది. అలాగే జ‌య‌జాన‌కినాయ‌క చిత్రంలో స్పెష‌ల్ సాంగ్‌లో న‌ర్తించింది. ఈ రెండు చిత్రాలు ఈ నెల 11న విడుద‌ల కానున్నాయి. మ‌రి ఈ రెండు చిత్రాల‌లో కేథ‌రిన్ కి ద‌క్కే విజ‌యం సెకండ్ హీరోయిన్ గానా.. లేక ఐటం గ‌ర్ల్ గానా అన్న‌ది త్వ‌ర‌లోనే తెలుస్తుంద‌న్న‌మాట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.