close
Choose your channels

చంద్రబాబు విడుద‌ల చేసిన 'జై సేన`లోని `పల్లె తల్లి..' పాట‌

Saturday, February 8, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చంద్రబాబు విడుద‌ల చేసిన జై సేన`లోని `పల్లె తల్లి.. పాట‌

శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌ గౌతమ్‌లను పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయిఅరుణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం 'జై సేన'. ఇప్పటికే విడుదలైన టీజ‌ర్‌, పాటలకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. కాగా ఈ చిత్రంలోని `పల్లె తల్లి నుదిటిమీద బొట్టే రైతన్నా..` సాంగ్ ను మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా..

చిత్ర దర్శకుడు సముద్ర మాట్లాడుతూ - ``రైతుల గొప్పతనాన్ని తెలియజేసే పాటను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విడుదలచేయడం చాలా సంతోషంగా ఉంది. అభినయ శ్రీనివాస్ చక్కని సాహిత్యం అందించిన ఈ పాటను కారుణ్య అంతే శ్రావ్యంగా ఆలపించారు. సంగీత దర్శకుడు రవిశంకర్ మంచి ట్యూన్ ఇచ్చాడు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ పాట‌కి అంతకన్నా మంచి రెస్పాన్స్‌ వస్తుందని ఆశిస్తున్నాం. అందరి అభిమానులు, రెండు రాష్ట్రాల ప్రజలు తప్పకుండా చూడాల్సిన చిత్రం 'జైసేన`` అన్నారు.

శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌గౌతమ్‌ పరిచయం అవుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.