close
Choose your channels

ఒక్క అడుగు.... ధ్వనించి పదేళ్లు

Wednesday, September 30, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఒక్క అడుగు ఒక్క అడుగు అంటూ ప్ర‌భాస్ ఆవేశంతో చెప్పిన‌ డైలాగులు ఇంకా మ‌న చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. బాజీరావు పేరును ఇంకా ఎవ‌రూ మ‌ర్చిపోలేదు. గుండు సూదీ గుండు సూదీ గుచ్చుకుంటే త‌ప్పు నీదీ అని, ఏ వ‌చ్చి బీ పై వాలే అని ఇంకా పాడుకుంటూనే ఉన్నాం. అప్పుడే ఆ సినిమాకు ప‌దేళ్ళు పూర్త‌య్యాయి. అవును. ఛ‌త్ర‌ప‌తి విడుద‌లై సెప్టెంబ‌ర్ 30వ తేదీకి ప‌దేళ్ళు పూర్త‌య్యాయి.

అప్ప‌టిదాకా మ‌ద్రాసులో నిర్మాత‌గా ఓ వెలుగు వెలిగిన బీవీయ‌స్‌య‌న్ ప్ర‌సాద్ హైద‌రాబాద్‌కు వ‌చ్చాక యంగ్ యాక్ట‌ర్స్ తో సినిమా తీయ‌డం మొద‌లుపెట్టింది కూడా అప్పుడే. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమాను త‌న సంస్థ‌లో 15కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో రూపొందించారు బీవీయ‌స్‌య‌న్ ప్ర‌సాద్‌. ఈ సినిమాకు సంబంధించి చాలా తీపి గుర్తులున్నాయ‌ని అంటారు ప్ర‌సాద్‌. ఆ సినిమా హిట్ అయి ఆ సినిమా పేరే ఇంటిపేరుగా మారిన వైనాన్ని మ‌ర్చిపోవ‌డం అంత తేలిక‌కాద‌నీ అంటారు. ష్యూర్ హిట్ సినిమా అని విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ‌ను చెప్పిన‌ప్పుడే అనుకున్నాన‌నీ అన్నారు నిర్మాత‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.