close
Choose your channels

చేతన్ చీను హీరోగా భారీ త్రిభాషా చిత్రం

Sunday, April 2, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రాజుగారి గది` ఫేమ్ చేతన్ చీను హీరోగా ఓ కొత్త సినిమా ప్రారంభమైంది. సత్యం` ఫేమ్ సూర్యకిరణ్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రూపొందనుంది.

7స్టార్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందే ఈ చిత్రం థ్రిల్లింగ్ లవ్ ఎంటర్టైనర్ గా రానుంది. మూడు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు.. మూడు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించబోతుండటం విశేషం. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందే ఈ చిత్రంతో చేతన్ రేంజ్ మరింతగా పెరుగుతుందని చెబుతున్నారు. దర్శకుడు సూర్యకిరణ్ చాలా కష్టపడి రాసుకున్న ఈ కథ అతనికి సత్యం`కు మించిన హిట్ గా నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ మూవీకి సంబంధించి హీరోయిన్ తో పాటు ఇతర తారాగణం ఎంపిక జరుగుతోంది.. ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తారు..అయితే సాంకేతికంగా చిత్రాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నామని చెబుతున్నారు.

అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీకి కెమెరామెన్ : పిసి. కన్నా, ఎడిటింగ్ : గౌతంరాజు, ఆర్ట్ డైరెక్టర్ : ఘాజీ`ఫేమ్ మురళి ఎస్వి, సంగీతం : సాయికార్తీక్, స్టంట్స్ : రమణ, నిర్మాణ సారథ్యం : పరిటాల రాంబాబు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సూర్యకిరణ్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.