close
Choose your channels

కృష్ణ ఫ్యామిలీకే కాదు.. చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్రమ‌కు తీర‌ని లోటు.! - చిరంజీవి

Thursday, June 27, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కృష్ణ ఫ్యామిలీకే కాదు.. చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్రమ‌కు తీర‌ని లోటు.!

విజయనిర్మల లాంటి ప్రతిభావంతురాలిని మ‌నం ఇప్పట్లో ఇంకెవ‌రినీ చూడ‌లేని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. అరుదైన ద‌ర్శక న‌టీమ‌ణి విజ‌య నిర్మల హ‌ఠాన్మర‌ణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయ నిర్మల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. "మ‌న తెలుగు ప‌రిశ్రమ‌లో భానుమ‌తి గారి త‌ర్వాత గ‌ర్వించ‌ద‌గిన బ‌హుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమ‌తి విజ‌య‌నిర్మల గారు. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. బాలనటిగా, కథానాయికగా.. దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభాపాటవాలను చాటారు విజయనిర్మల.

అంత‌టి ప్రతిభావంతురాలిని మ‌నం ఇప్పట్లో ఇంకెవ‌రినీ చూడ‌లేం. కృష్ణగారికి జీవిత భాగ‌స్వామినిగా ఎప్పుడూ ఆయ‌న ప‌క్కన నిల‌బ‌డి ఆయ‌న‌కు చేదోడు వాదోడుగా ఉంటూ త‌న ధ‌ర్మాన్ని నెర‌వేరుస్తూ వ‌చ్చారు. ఆమె లేని లోటు కృష్ణ గారికి ఆ కుటుంబానికే కాదు యావ‌త్ తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్రమ‌కి తీర‌ని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాల‌ని, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియ‌జేస్తూ కృష్ణగారికి, న‌రేష్‌కు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను" అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.