close
Choose your channels

'సైరా' షూటింగ్ కి సిద్ధమౌతున్నాడు

Thursday, September 21, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రం సైరా న‌రసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రం ఆగ‌స్టులో లాంఛ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగ‌ణ‌మే న‌టిస్తోంది. అమితాబ్ బ‌చ్చ‌న్‌, న‌య‌న‌తార‌, సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి, జ‌గ‌ప‌తిబాబు ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి డ‌బుల్ ఆస్కార్ అవార్డుల విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ అక్టోబ‌ర్ 20 నుండి ప్రారంభం కానుంద‌ని తెలిసింది. హైద‌రాబాద్‌లోని నాన‌క్‌రామ్‌గూడా స్టూడియోస్‌లో ఆర్ట్ డైరెక్ట‌ర్ రాజీవ‌న్ వేసిన ప్ర‌త్యేక సెట్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగ‌నుంద‌ని తెలిసింది. ఖైదీ నెం.150తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఈ చిత్రం కోసం ప్ర‌త్యేకంగా మేకోవ‌ర్ అయ్యారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.