close
Choose your channels

కమెడియన్‌ సునీల్‌కు అస్వస్థత.. అసలేం జరిగింది!?

Thursday, January 23, 2020 • తెలుగు Comments

కమెడియన్‌ సునీల్‌కు అస్వస్థత.. అసలేం జరిగింది!?

టాలీవుడ్ కమెడియన్, హీరో సునీల్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన.. హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో అత్యవసర వైద్యం తీసుకుంటున్నారు. కాగా.. ఆయన లివర్ సంబంధిత వ్యాధితో గత కొన్ని రోజులుగా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం ఆయన ఆస్పత్రిలో చేరగా.. వైద్యులు పలు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. లాంగ్ గ్యాప్ తర్వాత సునీల్ మళ్లీ టాలీవుడ్‌లో మంచి మంచి పాత్రల్లో నటిస్తూ మళ్లీ క్రీజులోకి వస్తున్నారు. సంక్రాంతికి విడుదలైన స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ చిత్రం ‘అల వైకుంఠపురములో’ సునీల్ నటించి మెప్పించారు. అంతేకాదు.. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వస్తున్న ‘డిస్కో రాజా’ లో కూడా  సునీల్ కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. ‘డిస్కో రాజా’ జనవరి-24న విడుదలకు కానుంది.

Get Breaking News Alerts From IndiaGlitz