ధనుష్ సోదరి ఆవేదన..ఆక్రోశం
Tuesday, March 7, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
వికీ లీక్స్..పనామా లీక్స్.. ప్రపంచ దేశాలను కుదిపేస్తే సుచీ లీక్స్ ఇప్పుడు సౌత్ ఇండస్ర్టీని కుదిపేస్తోంది. అదీ టార్గెట్ టెడ్ కోలీవుడ్ లో ఇప్పుడీ పెను సంచలనం జోరుగా కొనసాగుతోంది. ఇందులో అసలు నిజా నిజాలు ఏంటన్నవి తెలియదు గానీ.. తమిళ స్టార్ ధనుష్ మాత్రం బాగా పాపులర్ అయ్యాడు. దీంతో ఇరు వైపుల నుంచి ఎవరి అభిప్రాయాలు వాళ్లు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ మీమాంసకు ఎలాంటి ముగింపు ఉంటుందోనని సౌత్ ఫిల్మ్ ఇండస్ర్టీ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
అయితే తాజాగా ఈ వివాదంపై ధనుష్ సోదరి మిమలా గీత సోదరుడికి బాసటగా నిలిచింది. `సోషల్ మీడియాలో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారుండొచ్చు. అడ్డు చెప్పై రైట్ ఎవ్వరకీ లేదు. 12ఏళ్ల కుర్రాడికి కూడా ట్విట్టర్ , ఫేస్ బుక్ ఖాతా ఉంది. ఇలాంటి అశ్లీలమైన వీడియోలను..ఫోటోలు చూడటానికే అంతా ఎగబడుతున్నారు. కానీ ఇందులో నిజమెంతన్నది విశ్వసించలేకపోతున్నారు. అలాంటివి చూస్తే ముందు లోతుగా ఆలోచించడం మంచిది. మా కుటుంబం ఇలాంటి సంఘటనలకు చాలానే చూసింది. అవన్నీ విసుగు పుట్టే సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నానని వాపోయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.