close
Choose your channels

సంక్రాంతి కానుకగా 'డిక్టేటర్'

Monday, December 28, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం డిక్టేటర్. ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమాను సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ సందర్భంగా..

కో ప్రొడ్యూసర్, దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ `ప్రస్తుతం బాలకృష్ణ డిక్టేటర్ సాంగ్ చిత్రీకరణను పూర్తి చేశాం. వరికుప్పల యాదగిరి సాహిత్యం అందించిన టింగా టింగా... అనే స్పెషల్ సాంగ్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సాంగ్ ను బాలకృష్ణ, ముమైత్ ఖాన్, శ్రద్ధాదాస్ లపై చిత్రీకరించారు. డిసెంబర్ 20న థమన్ సంగీతంలో విడుదలైన పాటలకు, థియేట్రికల్ ట్రైలర్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

సినిమా చిత్రీకరణతో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి. సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్ లో విడుదల చేస్తున్నాం. నందమూరి అభిమానులు బాలయ్యబాబును ఎలా చూడాలనుకుంటున్నారో అలా, ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఫుల్ ఎంటర్ టైనింగ్ తో స్టయిలిష్ గా సినిమా రూపొందుతోంది అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.