close
Choose your channels

డిక్టేటర్ మూవీ రివ్యూ

Thursday, January 14, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
న‌టీన‌టులు- బాల‌కృష్ణ‌, అంజ‌లి, సోనాల్ చౌహాన్‌, నాజ‌ర్‌, ర‌తి అగ్నిహోత్రి, పృథ్వి, హేమ‌, రాజీవ్ క‌న‌కాల‌, అక్ష, విక్ర‌మ్ జీత్‌, క‌బీర్‌ త‌దిత‌రులు
మ్యూజిక్‌- ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ - శ్యామ్ కె.నాయుడు
బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌- చిన్నా
ఆర్ట్ - బ్ర‌హ్మ‌క‌డ‌లి
ర‌చ‌న - శ్రీధ‌ర్ సీపాన‌
మాట‌లు- ఎం.ర‌త్నం
ఫైట్స్ - ర‌వివ‌ర్మ‌
ఎడిటింగ్ - గౌతంరాజు
నిర్మాత‌- ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్
బ్యాన‌ర్‌- ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్‌, వేదాశ్వ క్రియేష‌న్స్‌‌
కో ప్రొడ్యూస‌ర్‌. స్క్రీన్‌ప్లే, దర్శ‌క‌త్వం - శ్రీవాస్‌

సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ సాధించిన నంద‌మూరి బాల‌కృష్ణ వంద‌వ చిత్రానికి చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. ఇలాంటి సంద‌ర్భంలో ప్ర‌తి సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉంటాయి. ఈ నేప‌థ్యంలో లౌక్యం వంటి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను స‌క్సెస్ కొట్టిన శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ 99వ సినిమా అన‌గానే నంద‌మూరి అభిమానులు శ్రీవాస్ బాల‌కృష్ణ మాస్ రోల్‌లో ప్ర‌జెంట్ చేస్తాడా లేక ప్యామిలీ హీరోగా చూపిస్తాడా? అంత‌కంటే ముందు ఎలాంటి టైటిల్ పెడ‌తారు అనే విష‌యాలు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించాయి. సినిమాపై భారీ అంచ‌నాలు పెరిగాయి. మ‌రి ఈ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా సినిమా ఉందా లేదా? అనే విష‌యాన్ని తెలుసుకోవాలంటే ముందు క‌థ‌లోకి వెళ‌దాం.
క‌థ‌
హైద‌రాబాద్‌కు చెందిన ఓ మినిష్ట‌ర్ అత‌ని కొడుకు క‌లిసి డ్ర‌గ్స్ వ్యాపారం చేస్తుంటారు. ఆ వ్యాపారాన్ని అడ్డుకోవ‌డానికి చూసిన వారిని చంపేస్తుంటారు. అలా ర‌సూల్(ర‌విప్ర‌కాష్‌) అనే పోలీస్ ఆఫీస‌ర్‌ను చంపేస్తారు. ఆ హ‌త్య‌ను చూసిన హోట‌ల్ చెఫ్‌(రాజీవ్ క‌న‌కాల) పారిపోతాడు. అత‌న్ని ప‌ట్టుకోవ‌డానికి ఆ గ్యాంగ్ వెంట‌ప‌డుతుంది. మ‌రోవైపు ధ‌ర్మ సూప‌ర్ మార్కెట్ మేనేజ‌ర్ చందు(బాల‌కృష్ణ‌), మావ‌య్య, బావ‌ల‌తో క‌లిసి ఉంటాడు. ఓ సంద‌ర్భంలో హీరోయిన్ అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తున్న ఇందు(సోనాల్ చౌహాన్‌)తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. అయితే హ‌త్య‌ను చూసిన చెఫ్ చెల్లెలు ఇందు కావ‌డంతో గ్యాంగ్ ఇందు వెంట‌ప‌డ‌తారు. అప్పుడు చందు వారి బారి నుండి ఇందును కాపాడ‌ట‌మే కాకుండా గ్యాంగ్ అంత‌టినీ స్మాష్ చేసేస్తాడు. దాంతో మినిష్ట‌ర్ మ‌నుషులు, డ్ర‌గ్స్ వ్యాపారం చేసే గ్యాంగ్ చందును వెతుకుతుంటారు. అప్పుడు చందు గురించి వారికి ఓ నిజం తెలుస్తుంది. చందు అస‌లు పేరు చంద్ర‌శేఖ‌ర్ ధ‌ర్మ అలియాస్ డిక్టేట‌ర్ అని, అత‌ను ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త రాజ‌శేఖ‌ర్ ధ‌ర్మ‌(సుమ‌న్‌) త‌మ్ముడ‌నే నిజాలు తెలుస్తాయి. అప్పుడేం జ‌రుగుతుంది? అస‌లు డిక్టేట‌ర్ పేరెందుకు మార్చుకుంటాడు? త‌న అన్న‌తో కాకుండా మావ‌య్య ఫ్యామిల‌తో ఉండాల్సిన అవ‌స‌రం ఏమిటి? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే
ప్ల‌స్ పాయింట్స్‌
బాల‌కృష్ణ న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇలాంటి మాస్ పాత్ర‌ల‌ను చాలా సునాయ‌సంగా ఎన్నింటినో చేశాడు కాబ‌ట్టి డిక్టేట‌ర్ పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసేశాడు. ఈ పాత్ర‌ను చాలా సునాయ‌సంగా చేసేశాడు. డ్యాన్సులు, ఫైట్స్ బాగా చేశాడు. డైలాగ్స్ డెలివ‌రీలో బాల‌య్య త‌న‌దైన మార్కు చూపించారు. ద‌ర్శ‌కుడు శ్రీవాస్ కొత్త ప్రయోగాలు చేయ‌కుండా ఓ ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను రూపొందించాడు. నంద‌మూరి అభిమానులు బాల‌కృష్ణ‌ను ఎలా చూడాల‌నుకుంటారో అలా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. థ‌మ‌న్ మ్యూజిక్ బావుంది. చిన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూప‌ర్‌. గౌతంరాజు ఎడిటింగ్ బావుంది. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ ఈరోస్ తొలిసారి నిర్మించిన ద‌క్షిణాది చిత్ర‌మిది కావ‌డంతో నిర్మాణ విలువ‌లు బావున్నాయి. అంజ‌లి చాలా నేచుర‌ల్‌గా న‌టించింది. సోనాల్ చౌహాన్ త‌న పాత్ర‌కు న్యాయం చేసింది. అజ‌య్‌, ర‌విప్ర‌కాష్, నాజ‌ర్‌, రాజీవ్ క‌న‌కాల‌, పృథ్వీ, ర‌ఘుబాబు ఇలా అంద‌రూ త‌మ త‌మ పాత్ర‌ల ప‌రిధి మేర న‌టించారు.
మైన‌స్ పాయింట్స్‌
డిక్టేట‌ర్ టైటిల్‌లో బాల‌య్య చూపించిన తీరు సింపుల్‌గానే క‌న‌ప‌డుతుంది. టైటిల్‌కు సినిమా న‌డిచే క్ర‌మానికి పోలిక ఉండ‌దు. రోటీన్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. థ‌మ‌న్ అందించిన సాంగ్స్‌లో మూడు మాత్ర‌మే బావున్నాయి. ప్ర‌తి డైలాగునూ బాల‌య్య బిగ్గ‌ర‌గా చెప్పారు. డైలాగ్ మోడ్యులేష‌న్ లో అప్ అండ్ డౌన్స్ ఉంటే బావుండేదనిపించింది. బ‌ల‌మైన విల‌నిజం క‌నిపించ‌దు. ర‌తి అగ్నిహోత్రిని ఢిల్లీని శాసించే మ‌హిళ‌గా చూపించిన‌ప్ప‌టికీ అంత ఎలివేష‌న్ పాత్ర ప‌రంగా ఉండ‌దు. త‌మ‌న్ ట్యూన్లు కూడా పెద్ద‌గా ఆక‌ట్టుకోవు. బాల‌య్య డిక్టేట‌ర్ ఎంట్రీని చూపించిన రేంజ్‌లో సినిమాలో చందు పాత్ర ఎంట్రీని చూపించ‌రు. సోనాల్ చౌహాన్ ట్ర‌య‌ల్స్ ఎంత వ‌ర‌కు వ‌చ్చాయి? ఆమె హీరోయిన్ అయిందా? లేదా? వ‌ంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొర‌క‌దు. ఈ త‌ర‌హా పాత్ర‌లు బాల‌య్య‌కి కొత్త కాదు. అమాయ‌కుడిగా, బ‌ల‌మైన వ్య‌క్తిగా బాల‌య్య ఇది వ‌ర‌కు చాలా సినిమాల్లో క‌నిపించారు. సో ఆడియ‌న్ కొత్త‌గా ఫీల్ కావాల్సింది ఇందులో ఏమీ ఉండ‌దు.శ్యామ్ కె.నాయుడు ఫోటోగ్ర‌ఫీ ఇంప్రెసివ్‌గా అనిపించ‌దు. చాలా షార్ట్ ల్లో బాల‌య్య పొట్టిగా క‌నిపిస్తారు. అంజ‌లి, బాల‌య్య లావుగా క‌నిపిస్తారు. టూమ‌చ్ ఆఫ్ కేర‌క్ట‌ర్స్ తో స్క్రీన్ క్ల‌మ్సీగా ఉంటుంది.
విశ్లేష‌ణ‌
నిర్మాణ సంస్థ‌గా తెలుగులోనే కాదు సౌత్‌లో ఈరోస్ నిర్మించిన తొలి చిత్ర‌మిదే. శ్రీమీరు ప‌బ్లిసిటీ కోసం చేస్తారేమో కానీ నేను ఏదీ చేసిన ప‌బ్లిసిటియే, మీలాంటి వాళ్ళు అడుగ‌డుగునా ఉంటారు. కానీ నాలాంటి వారు అరుదుగా ఉంటారు. సింహం నీరు త్రాగేట‌ప్పుడు త‌ల వంచింది క‌దా అని జింక తొడ కొట్ట‌కూడ‌దు, తొడ‌, మెడ రెండు ఉండ‌వు...ఇలాంటి మాస్ ప‌ల్స్ తెలిసిన డైలాగ్స్ చాలానే ఉన్నాయి. ఫ‌స్టాఫ్‌లో పృథ్వీ కామెడి ఆశించిన మేర పండ‌లేదు. సెకండాఫ్‌లో పోసాని కామెడి ఆడియెన్స్‌కు న‌వ్వ‌ను తెప్పిస్తుంది. వాస్ ఎక్క‌డా ఎక్స్‌పెరిమెంట్స్ జోలికి వెళ్ళ‌లేదు. బాల‌య్య‌ను ప‌వ‌ర్‌ఫుల్‌గా అభిమానులు కోరుకునేలా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. మ్యూజిక్‌, సినిమాటోగ్ర‌ఫీ ఇత్యాది విష‌యాలు నుండి త‌మ వంతుగా స‌హాకారం ల‌భించాయి.
బాట‌మ్ లైన్‌: డిక్టేట‌ర్ ఫ్యాన్స్ కోస‌మే

రేటింగ్‌: 3/5

English Version Review

Watch Dictator Movie Review

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.