close
Choose your channels

దృశ్యకావ్యం ట్రైలర్ కు విశేష స్పందన

Friday, January 22, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై, శ్రీమంతి బెల్లం సుధారెడ్డి సమర్పణలో ప్రొడక్షన్ నెం.3గా బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రం దృశ్యకావ్యం. ఈ చిత్రం సరికొత్త కథాంశంతో, ఆద్యంతం ఉత్కంఠ భరితంగా లవ్, ఎమోషన్, సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో సాగుతుంది. ఈ చిత్రం ద్వారా బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శకుడిగా పరిచయమౌతున్నారు. ప్రాణం కమలాకర్ మ్యూజిక్ మరో ఎస్సెట్. ప్రాణం, వాణ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన కమలాకర్ ఈ చిత్రానికి తన మెలోడియస్ మార్క్ సంగీతం అందించడం విశేషం. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... దృశ్యకావ్యం చిత్ర ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్ విడుదలైన తర్వాత అటు బిజినెస్ పరంగాను... ఇటు ఇండస్ట్రీ వర్గాల ద్వారా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలతో ఈ చిత్రాన్ని నిర్మించాం. దర్శకుడు రామకృష్ణారెడ్డి ఓ మంచి పాయింట్ తో లవ్, ఎమోషన్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ని జోడించి రూపొందించారు. కథ, కథనం కొత్తగా ఉంటాయి. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగుతుంది. కొత్త దర్శకుడైనా... అనుభవమున్న దర్శకుల చిత్రాల్లో కనిపించే స్క్రీన్ ప్లే ఈ చిత్రంలో చూపించాడు. ప్రాణం కమలాకర్ పాటల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి మెలొడీ పాటలు అందించడంలో ఆయనకు ప్ర్తత్యేక గుర్తింపు ఉంది. దృశ్యకావ్యం కోసం ఆయన ప్రత్యేక శ్రద్ధతో మంచి పాటలందించారు. ఆడియోకు అద్భుతమైన స్పందన తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాం. పాటలు ఈ చిత్రానికి ప్రాధాన ఎస్సెట్. హీరో కార్తిక్, హీరోయిన్ కాశ్మీరా మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఎంటర్ టైన్ మెంట్ కు స్కోప్ ఉన్న చిత్రం కాబట్టి అన్ని వర్గాల్ని తప్పకుండా అలరిస్తుంది. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు భారీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. అని అన్నారు.

కార్తిక్, కాశ్మీరా కులకర్ణి (నూతన పరిచయం), డా.ఆలి, పృథ్వీ రాజ్, జీవ, సత్యం రాజేష్, శాని, మధునందన్, బేబి హాసిని, చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్, రచ్చ రవి, రాకేష్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రల్లో అలరించనున్నారు.

బ్యానర్ - పుష్యమి ఫిలిం మేకర్స్ , సంగీతం - ప్రాణం కమలాకర్ , కెమెరా - సంతోష్ శానమోని , ఎడిటర్ - వి.నాగిరెడ్డి , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - కొల్లు శివ నాగేంద్ర రావు , పిఆర్ఓ - ఏలూరు శీను , ఎఫెక్ట్స్ - యతి రాజ్, , ల్యాబ్ - రామానాయుడు, గ్రాఫిక్స్ - జెమిని , పబ్లిసిటీ డిజైన్స్ - ఈశ్వర (లక్ష్మీ కాంత్)

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.