close
Choose your channels

హేబాకో ర‌కం.. సోనారిక‌కో ర‌కం..

Saturday, March 26, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హ్యాట్రిక్ విజ‌యాల త‌రువాత రాజ్ త‌రుణ్ న‌టించిన 'సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు' బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. దాంతో త‌న త‌దుప‌రి చిత్రం 'ఈడో ర‌కం.. ఆడో ర‌కం'పై బోలెడు ఆశల‌ను పెట్టుకున్నాడు. విష్ణు మ‌రో హీరోగా న‌టిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా విజ‌యం విష్ణుకి కూడా కీల‌క‌మే. ఎందుకంటే.. అత‌ను స‌క్సెస్‌ని టేస్ట్ చూసి చాలా కాల‌మే అయ్యింది మ‌రి.

ఇదిలా ఉంటే.. ఈ మినీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ హీరోల కంటే.. హీరోయిన్‌ల ప‌రంగానే ఆస‌క్తి రేపుతోంది. ఎందుకంటే.. అందులో న‌టిస్తున్న హీరోయిన్లకు రెండు ర‌కాల హ్యాట్రిక్‌లు ముడిప‌డి ఉన్నాయి మ‌రి. అదెలాగంటే.. 'అలా ఎలా', 'కుమారి 21 ఎఫ్' త‌రువాత హేబా ప‌టేల్‌కి ఈ కొత్త చిత్రం హిట్ సినిమాల ప‌రంగా హ్యాట్రిక్‌గా నిల‌వ‌నుంది. ఇక సోనారిక‌కి 'జాదుగాడు', 'స్పీడున్నోడు' వంటి రెండు వ‌రుస ప‌రాజ‌యాల త‌రువాత న‌టిస్తున్న సినిమా కావ‌డంతో ఈ సినిమా విజ‌యం ఆమెకి కీల‌కంగా మారింది. సినిమా హిట్ అయితే స‌రి.. లేదంటే ఫ్లాప్‌ల హ్యాట్రిక్‌ని మూట‌గ‌ట్టుకోవాల్సిందే. చూద్దాం.. 'హేబాకో ర‌కం.. సోనారిక‌కో ర‌కం..' అన్న‌ట్లుగా ఉన్న‌ ఈ హ్యాట్రిక్ ల ముచ్చ‌ట ఏ తీరానికి చేరుతుందో?

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.