ఓం నమో వెంకటేశాయ రిలీజ్ గురించి ఎక్స్ క్లూజీవ్ న్యూస్..!
Wednesday, October 19, 2016 తెలుగు Comments
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
Listen to article
--:-- / --:--
1x
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
నవరస సమ్రాట్ నాగార్జున - దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్న భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ. ఈ చిత్రాన్ని సాయికృపా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై మహేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. అందాల తారలు అనుష్క, ప్రగ్యా జైస్వాల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ భక్తిరస చిత్రం కోసం ఇటీవల మహాబలేశ్వరంలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే...ఈ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందు వస్తుంది అని నాగ్ ను అడిగితే...గెడ్డం లేకుండా తీయాల్సిన కొన్ని సీన్స్ ఉన్నాయి.
ఆ సీన్స్ ను త్వరలో షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. నవంబర్ కి షూటింగ్ మొత్తం పూర్తి చేయనున్నాం. రిలీజ్ డేట్ ముందుగా ఎనౌన్స్ చేసి ఆతర్వాత సీజీ వర్క్ కాలేదు అంటూ పోస్ట్ పోన్ చేస్తే బాగోదు అని ఆలోచిస్తున్నాం. మేము అనుకున్నట్టుగా అన్నీ జరిగితే...ఖచ్చితంగా జనవరిలోనే ఓం నమో వేంకటేశాయ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం అని తెలియచేసారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.