close
Choose your channels

ఎఫ్3 ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థ్యాంక్స్ : ఎఫ్3 టీం

Friday, May 27, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

''ఎఫ్ 3ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. ఎఫ్ 3 చిత్రానికి మొదటి ఆట నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది. మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్, కిడ్స్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు,. యూనివర్షల్ గా అన్ని ఏరియాల నుండి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు. కుటుంబం అంతా కలిసొచ్చి ఎఫ్ 3 ని ఎంజాయ్ చేయడం ఆనందంగా వుంది'' అని పేర్కొంది ఎఫ్3 చిత్ర యూనిట్.

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'.

డబుల్ బ్లాక్‌బస్టర్ 'F2' ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పకులుగా నిర్మాత శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎఫ్3 శుక్రవారం (మే 27) ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలై యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ తో ప్రభంజనం సృష్టించింది. ఈ సందర్భంగా హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు సక్సెస్ సెలబ్రేషన్స్ భాగంగా మీడియా మీట్ లో మాట్లాడారు.

విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. ఎఫ్ 3ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. పాండమిక్ తర్వాత చాల సినిమాలు వచ్చాయి. యూత్, మాసే థియేటర్ కి వస్తున్నారని వినిపించేది. దిల్ రాజు గారు, అనిల్ రావిపూడి మేము అంతా కలసి ఫ్యామిలీస్ ని థియేటర్ కి రప్పించాలనే లక్ష్యం పెట్టుకున్నాం. ఆ లక్ష్యం ఎఫ్ 3తో నెరవేరినందుకు ఆనందంగా వుంది. కుటుంబం అంతా కలిసొచ్చి ఎఫ్ 3 ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎఫ్ 2 తర్వాత నేను థియేటర్ కి వెళ్లి చూసిన ఎఫ్ 3నే. దేవి థియేటర్ లో చూశాను. థియేటర్లో ప్రేక్షకులు రియాక్షన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తున్నారు. దిల్ రాజు గారు, శిరీష్ గారు ఎఫ్ 2 తర్వాత మళ్ళీ ఇంతపెద్ద ఎంటర్ టైనర్ తీసునందుకు సంతోషంగా వుంది. అనిల్ రావిపూడి ఎఫ్ 2 కంటే అద్భుతమైన వర్క్ చేశారు. ఎఫ్ 3 యూనిట్ అంతా వండర్ ఫుల్ టీం వర్క్ చేసింది. ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ వచ్చి ఎఫ్ 3 ని ఎంజాయ్ చేయాలి'' అని కోరుకున్నారు .

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. '' ఎఫ్ 3కి యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ రావడం ఆనందంగా వుంది. ఎఫ్ 3 చూసిన ప్రేక్షకులు సూపర్ ఎక్స్ ట్రార్డినరీ, అదిరిపోయిందిగా..! అంటున్నారు. ఇక్కడ చూసిన ఇదే మాట వినిపిస్తుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు గారు, వెంకటేష్ గారికి థ్యాంక్స్. వెంకటేష్ గారితో అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరింది. మా కాంబినేషన్ ని ప్రేక్షకులు ఇంత గొప్పగా ఆదరించడం ఆనందంగా వుంది. ఎఫ్ 3 ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు'' అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఎఫ్ 3 చిత్రానికి మొదటి ఆట నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది. ఎఫ్ 3తో మరో బిగ్గెస్ట్ సక్సెస్ ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఎఫ్ 3 మాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. వెంకటేష్ గారి సీతమ్మవాటిట్లో సిరిమల్లె చెట్టు, ఎఫ్ 2, ఇప్పుడు ఎఫ్ 3 తో హ్యాట్రిక్ విజయం, అలాగే వరుణ్ తేజ్ తో ఫిదా, ఎఫ్ 2, ఇప్పుడు ఎఫ్ 3 హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం చాలా ప్రత్యేకం. మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్, కిడ్స్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు,.. అమెరికా, లండన్, రాయలసీమ, కోస్తా, నిజాం ఇలా యునివర్షల్ గా అన్ని ఏరియాల నుండి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు. వెంకటేష్ గారు, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడితో మా జర్నీ విజయవంతంగా కొనసాగుతున్నందుకు ఆనందంగా వుంది. బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు'' తెలిపారు.

దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఎఫ్ 3ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఉదయం నుండి 'ఎనీ సెంటర్ సింగల్ టాక్ బ్లాక్ బస్టర్' అనే మాటే వినిపిస్తుంది. ప్రేక్షలులు థియేటర్ లో పడిపడి నవ్వుతున్నారు. ఎఫ్ 2 కంటే గొప్ప రెస్పాన్స్ వచ్చింది. ఎఫ్ 3 రెండేళ్ళ ప్రయాణం. అందరం ఒక ఫ్యామిలీలా పని చేశాం. దిల్ రాజు గారు, శిరీష్ గారితో ఇది నాకు ఐదో సినిమా. ఈ రోజు ఉదయం రాజుగారికి ఒక హ్యాపీ హాగ్ ఇచ్చాను. వెంకటేష్ గారి బిగ్ థ్యాంక్స్. ఒక స్టార్ ఇమేజ్ వుండి కామెడీని ఇలా పండించడం చాలా కష్టం. ఈ విషయంలో వెంకటేష్ గారి స్పెషల్ థ్యాంక్స్. ఒకొక్క ఎపిసోడ్ ని ప్రేక్షకులు సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఎఫ్ 3ని మరో లెవెల్ కి తీసుకెళ్ళిందుకు ఆనందంగా వుంది. వరుణ్ తేజ్ అద్భుతంగా చేశారు. ఈ ప్రయాణం ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇలా హాయిగా నవ్వుకునే సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ప్యామిలీ అంతా కలసి వెళ్ళండి... హాయిగా నవ్వుకోండి'' అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.