close
Choose your channels

గోల్డెన్ గ్లోబ్ అవార్డుల సందడి

Monday, January 7, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గోల్డెన్ గ్లోబ్ అవార్డుల సందడి

76వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల సందడి ప్రారంభమైంది. సోమవారం ఉదయం కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్స్ ప్రాంతంలో ఈ వేడుక జరిగింది. హాలీవుడ్‌కి చెందిన సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముందు ఈ వేడుకను నిర్వహిస్తారు.

ఈ వేడుకకు హాలీవుడ్ నటులు ఆండీ సామ్‌బర్గ్, సాండ్రా ఓహ్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. హాలీవుడ్‌లో ‘మీటూ’ ఉద్యమం గందరగోళాన్ని సృష్టించిన నేపథ్యంలో ఈ ఏడాది చాలామంది సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కాలేదు.

ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల విజేతలను ఒకసారి పరిశీలిస్తే... ఉత్తమ చిత్రంగా గ్రీన్ బుక్, ఉత్తమ దర్శకుడుగా అల్ఫాన్సో కార్వోన్, ఉత్తమ నటిగా, ఒలీవియా కోల్మన్, ఉత్తమ నటుడుగా క్రిస్టియన్ బేల్, ఉత్తమ సహాయ నటుడుగా మహర్షెలా అలీ, ఉత్తమ సహాయ నటిగా రెజీనా కింగ్, ఉత్తమ టీవీ సిరీస్‌గా ది అసాసినేషన్ ఆఫ్ గియాన్నీ వర్సాచీ, ఉత్తమ విదేశీ చిత్రంగా రోమా అవార్డులు అందుకున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.