close
Choose your channels

మెగా ఫాలోవర్స్‌కు శుభవార్త చెప్పిన నాగబాబు

Monday, April 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగా ఫాలోవర్స్‌కు శుభవార్త చెప్పిన నాగబాబు

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు మెగాభిమానులకు, జనసేన కార్యకర్తలకు, మెగా ఫాలోవర్స్‌కు గుడ్ న్యూస్ అందించారు. ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో వీడియోలు, పలు ఆసక్తికర పోస్ట్‌లు చూస్తూ అభిమానులకు దగ్గరగా ఉండే నాగబాబు.. ఇప్పుడు మెగాభిమానులకు మరింత దగ్గరయ్యారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లను ఆయన ప్రారంభించారు. ఈ విషయమై మెగా బ్రదర్ ఫేస్‌బుక్‌లో స్పందించారు.

అభిమానులు, కార్యకర్తలకు విజ్ఞప్తి..

"హలో ఫ్రెండ్స్.. మీ అందరికీ మరింత చేరువయ్యేందుకు వీలుగా, అభిమానులు, స్నేహితులు జనసేన కార్యకర్తల విజ్ఞప్తి మేరకు ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో అకౌంట్లను ప్రారంభిస్తున్నాను" అని తెలిపారు. ఈ రెండింటికి సంబంధించిన లింక్‌లను ఫేస్‌బుక్ నాగబాబు పోస్ట్ చేశారు.

కాగా నాగబాబు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసిన విషయం తెలిసిందే. రిజల్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా బ్రదర్ వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. అయితే ఫలితం ఎలా ఉంటుందో ఏమో అని అటు మెగాభిమానులు.. ఇటు జనసేన కార్యకర్తల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.