close
Choose your channels

బాలీవుడ్‌లోకి 'గూఢ‌చారి'

Thursday, November 22, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాలీవుడ్‌లోకి గూఢ‌చారి

జేమ్స్‌బాండ్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన `గూఢ‌చారి` చాలా పెద్ద విజ‌యాన్ని అందుకున్న సంగ‌తి తెలిసిందే. అడివిశేష్ ఈ సినిమాలో హీరోగా న‌టించ‌డ‌మ‌యే కాకుండా క‌థ‌, స్క్రీన్‌ప్లే అందించారు. అతి త‌క్కువ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన జేమ్స్ బాండ్ మూవీ ఇదేనేమో. చాలా పెద్ద విజ‌యాన్ని సాధించి ప్రేక్ష‌కులు, సినీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ రీమేక్ చేయ‌బోతున్నార‌ట‌.

ఇటీవ‌ల మీడియా స‌మావేశంలో ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. అయితే ఎవ‌రో నటిస్తార‌నే దానిపై క‌ర‌ణ్ ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు. బాహుబ‌లి పార్ట్ 1, బాహుబ‌లి2 చిత్రాలకు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించిన క‌ర‌ణ్ జోహార్ ఈ నెల 29న విడుద‌ల కాబోయే `2.0` చిత్రానికి కూడా స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.