close
Choose your channels

Bigg Boss Telugu 7 : ప్రశాంత్ సేఫ్ గేమ్ , బిగ్‌బాస్ నుంచి గౌతమ్ ఎలిమినేట్ .. అర్జున్ బతికిపోయాడన్న నాగార్జున

Monday, December 4, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 7 తెలుగు తుది అంకానికి చేరుకుంది. మరికొద్దిరోజుల్లో సీజన్ ముగియనుంది. ఇప్పటికే అర్జున్ అంబటి ఫినాలే అస్త్రను సాధించి ఈ సీజన్‌లో తొలి ఫైనలిస్టుగా నిలిచాడు. ఇక ఈ వారం ఇంటి నుంచి ఎవ్వరూ ఊహించని విధంగా డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యాడు. ఈ సీజన్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకడిగా నిలిచిన గౌతమ్ టాప్‌లో ఒకడిగా, ఖచ్చితంగా విజేతగా నిలుస్తాడని అంతా భావించారు. కానీ అనుకోని విధంగా ఆయన ఇంటిని వీడాడు. గౌతమ్ ఎలిమినేషన్‌కు ముందు హౌస్‌లో చాలా పరిణామాలు జరిగాయి. పల్లవి ప్రశాంత్ దగ్గర వున్న ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను తన కోసం వాడాలా లేదా మరొకరి కోసం వినియోగించాలా అనేది పూర్తిగా ప్రశాంత్ ఇష్టమే.

నామినేషన్స్‌లో వున్న ప్రియాంక, శివాజీ, ప్రిన్స్ యావర్‌లను సేవ్ చేస్తూ వచ్చారు నాగ్.. చివరికి ప్రశాంత్, శోభా, గౌతమ్‌లు మిగిలారు. ఈ సమయంలో ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను ఖచ్చితంగా వాడాల్సిందేనని .. లేనిపక్షంలో పాస్‌ను తిరిగి ఇవ్వాల్సిందేనని ఆయన అల్టీమేటం జారీ చేశారు. అయితే ఈ పాస్‌ను తన కోసం వాడనని వేరేవ్వరికి ఉపయోగించనని చెప్పి షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు ప్రశాంత్. నీకు తక్కువ ఓట్లు వస్తే ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతావని నాగార్జున హెచ్చరించినా రైతుబిడ్డ పట్టించుకోలేదు. కాసేపటికి ప్రశాంత్ సేవ్ అవ్వగా.. శోభాశెట్టి, గౌతమ్‌లు మిగిలారు. అనంతరం వీరిని ప్రత్యేక రూమ్‌కి తీసుకెళ్లిన నాగార్జున.. మీ ఇద్దరి వెనుక శ్వాస తీసుకునే డ్రాగన్స్ వుంటాయి. ఎవరి వెనుక ఉన్న డ్రాగన్ శ్వాస తీసుకోవడం ఆగిపోతుందో వారు ఎలిమినేట్ అవుతారని చెప్పాడు. గౌతమ్ వెనుక వున్న డ్రాగన్ శ్వాస తీసుకోవడం ఆగిపోవడంతో ఆయన ఎలిమినేట్ అయినట్లుగా నాగార్జున ప్రకటించారు.

అనంతరం స్టేజ్ మీదకు వచ్చిన గౌతమ్‌ తన జర్నీ చూసుకుని ఎమోషనల్ అయ్యాడు. తర్వాత ఇంటి సభ్యుల్లో ఎవరికి మాస్క్ వుంది, ఎవరికి లేదో చెప్పాలని టాస్క్ ఇచ్చాడు నాగ్. అర్జున్‌కు మాస్క్ లేదని, అమర్ స్ల్పిట్ పర్సనాలిటీలాగా వుంటాడని, అప్పుడప్పుడు మాస్క్ కనిపిస్తుందని చెప్పాడు. ప్రియాంకకు అసలు మాస్క్ లేదని, శోభకు కొంచెం మాస్క్ వుందని తెలిపాడు. యావర్‌తో గతంలో జరిగిన గొడవలకు గాను సారీ చెబుతూ ఆయనకు కూడా మాస్క్ లేదన్నాడు. శివాజీ వెనుక వుండొద్దని, ఆయన పక్కన నడవొద్దని.. తనను కొట్టి పైకి రావాలంటూ పల్లవి ప్రశాంత్‌ను ఉద్దేశించి అన్నాడు. శివాజీ గురించి చెప్పబోతుండగా.. ఆయనే రివర్స్‌లో గౌతమ్ గురించి చెప్పాడు. నువ్వు భయం భయంగా వుండేవాడివని, ఎవరో ఒకరు కావాలని కోరుకునేవాడివి, అలా వుండటం జీవితంలో కరెక్ట్ కాదని.. ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు.

అందరి దగ్గరా గౌతమ్ వీడ్కోలు తీసుకుని వెళ్లిపోయాక నాగార్జున అసలు విషయం చెప్పాడు. నిజానికి అర్జున్ ఈ వారం ఎలిమినేట్ కావాల్సి వుందట. కానీ ఫినాలే అస్త్రను సాధించి, ఫైనల్స్‌లో అడుగుపెట్టడంతో బతికిపోయాడని .. అందుకే రాబోయే రెండు వారాలు జాగ్రత్తగా ఆడాలని నాగార్జున సూచించారు. ఇక బిగ్‌బాస్ సీజన్ 7 విజేతగా నిలిచేవారికి ప్రైజ్ మనీ గురించి కీలక ప్రకటన చేశాడు నాగర్. టైటిల్ విన్నర్‌కు ట్రోఫీతో పాటు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ, మారుతీ సుజుకీ బ్రెజా కారు , రూ.15 లక్షలు విలువైన డైమండ్ నెక్లెస్ వస్తాయని చెప్పడంతో కంటెస్టెంట్స్ అంతా ఖుషీ అయ్యారు. ఒకవేళ తాము టైటిల్ గెలిస్తే ఏం చేస్తామో ఒక్కొక్కరు చెబుతూ వెళ్లగా.. శివాజీ మాత్రం మనసులోనే వుంచుకున్నాడు.

అంతకుముందు ఆదివారం కావడంతో ఆటలు , పాటలతో హోరెత్తించాడు నాగార్జున. ఎపిసోడ్ ప్రారంభం కాగానే నాగ్‌కు బదులుగా హీరో నాని హోస్ట్‌గా రావడంతో కంటెస్టెంట్స్ షాక్ అయ్యారు. ఆయన నటించిన ‘‘హాయ్ నాన్న ’’ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల కోసం ఆయన బిగ్‌బాస్ స్టేజ్‌ను ఉపయోగించుకున్నాడు. తర్వాత నాగార్జున ఎంట్రీ ఇచ్చి నానిని హగ్ చేసుకున్నాడు. అనంతరం కంటెస్టెంట్స్‌ ఒక్కొక్కరిని నానికి పరిచయం చేశారు నాగ్. తర్వాత ఇంటి సభ్యులను ఆటపట్టించారు నాగ్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.