Helicopter Crashed:బ్రేకింగ్: తూప్రాన్‌లో కూలిన శిక్షణ హెలికాఫ్టర్.. ఇద్దరు మృతి
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
మెదక్ జిల్లా తూప్రాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మున్సిపల్ పరిధి రావెల్లి శివారులో శిక్షణ హెలికాప్టర్ కూలింది. హైదరాబాద్‌కు చెందిన హెలికాప్టర్ సోమవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కూలిపోయింది. భారీగా శబ్దం రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
కూలిన శిక్షణ హెలికాప్టర్లో మంటలు చెలరేగి ఒకరు లేక ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దుండిగల్ ఎయిర్‌పోర్టుకు చెందిన శిక్షణ విమాణం హైదరాబాద్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. హెలికాఫ్టర్ పూర్తిగా కాలిపోవడంతో ఎంతమంది మృతి చెందారనే విషయం తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments