close
Choose your channels

Bigg Boss Telugu 7: శోభాపై శివన్న చిందులు, అమర్‌పైనా ఫైర్

Saturday, December 9, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Bigg Boss Telugu 7: శోభాపై శివన్న చిందులు, అమర్‌పైనా ఫైర్

బిగ్‌బాస్ 7 తెలుగు తుది అంకానికి చేరుకుంది. మరికొద్దిరోజుల్లో సీజన్ ముగియనుంది. ప్రస్తుతం హౌస్‌లో ఓటు అప్పీల్ టాస్క్‌లు నడుస్తున్నాయి. అయితే అమర్‌దీప్ వ్యవహారశైలి ఎందుకో గాడి తప్పింది. సరదా సరదాగా వుండే అతను ఎందుకో కఠినంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఫినాలే అస్త్ర గేమ్స్ సమయంలో తనకు పాయింట్స్ ‌ఇవ్వలేదంటూ ఫ్రెండ్ అని కూడా చూడకుండా ప్రియాంకను మాటలతో హింసించాడు. గేమ్ ఆడుతున్నప్పుడు ఆడపిల్ల అన్న కనికరం లేకుండా ఆమెను ఫిజికల్‌గా అటాక్ చేసి బాధపెట్టాడు. ప్రియాంక నొప్పితో బాధపడుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా నాకు పాయింట్స్ ఇవ్వలేదు.. ఇవ్వలేదంటూ నస పెట్టాడు.

ఇక ఎప్పుడైతే కెప్టెన్‌గా లక్కీ ఛాన్స్ అందుకున్నాడో అప్పటి నుంచి అమర్‌దీప్‌‌లో ఇంకో కొత్త యాంగిల్ బయటపడింది. కెప్టెన్‌గా కొందరికి ఎక్కువ పనులు, కొందరికి తక్కువ పనులు అప్పజెబుతున్నాడు. అంతేకాదు.. వరుసపెట్టి కొట్లాటలు, గొడవలు పెట్టుకుంటున్నాడు. నిన్నటి గేమ్‌లో పల్లవి ప్రశాంత్‌‌తో గొడవ తారాస్థాయికి చేరుకుంది. అతనిని తిడుతూ కొడుతూ ఒరేయ్ అని పిలుస్తూ చెప్పు చూపిస్తూ కొట్టబోయాడు. నన్ను కొరుకుతున్నావేంటి అన్నా అని ప్రశాంత్ అడిగితే రైతుబిడ్డను మెడికల్ రూమ్‌లోనే తేల్చుకుందాం పదా అని హీనంగా ప్రవర్తించాడు. ఈ చర్యలతో అతనికి మద్ధతు పలికేవారు తగ్గిపోతూ.. విన్నర్ రేసు నుంచి తప్పుకునే పరిస్ధితి వచ్చింది. వున్న కొద్దిరోజుల్లో ఆ స్థాయిలో మద్ధతు సంపాదించడం కష్టమేననే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Bigg Boss Telugu 7: శోభాపై శివన్న చిందులు, అమర్‌పైనా ఫైర్

ఇకపోతే.. ఓటు అప్పీల్‌లో భాగంగా ప్రస్తుతం బాల్ గేమ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా హౌస్‌లోని కంటెస్టెంట్స్ అందరికీ టీ షర్ట్స్ ఇస్తాడు. కంటెస్టెంట్స్ ఒక లైన్‌లో వుంటూ వారి వద్ద వున్న బాల్స్‌ను తను ప్రత్యర్ధులు అనుకున్న ఇంటి సభ్యుల టీ షర్ట్స్‌పై విసరాలి. ఎవరి టీ షర్ట్స్‌కు ఎక్కువ బంతులు అంటుకుంటాయో వారు ఔటైనట్లు. తొలుత శోభా, యావర్, అమర్‌దీప్, ప్రశాంత్‌లు ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అయ్యారు. మూడో రౌండ్‌లో ప్రియాంక, శివాజీ, అర్జున్‌లు మిగిలారు. ఈ సందర్భంగా ప్రియాంకకు సపోర్ట్ చేసేలా సంచాలకురాలిగా వున్న శోభ కేకలు పెట్టింది. అది చూసి శివాజీకి కోపం వచ్చి నేను ఆడనంటూ వెళ్లిపోయాడు. యావర్ అతనిని ఆపేందుకు యత్నించగా.. ప్రియాంక ఒక్కటే ఆడుతుందా, సంచాలకురాలిగా శోభ అందరికీ సపోర్ట్ చేయాలి కదా అని ప్రశ్నించాడు. దీనికి శోభ నా ఇష్టం అని తేల్చిచెప్పింది. అక్కడితో ఆగకుండా కూర్చొని నీళ్లు తాగండి.. అంటూ వెటకారంగా మాట్లాడింది. ఆడపిల్ల అని అడ్వాంటేజ్ తీసుకోవద్దని.. అయ్యాయ్యో.. బాబాయ్‌లే తర్వాత తెలుస్తాయి అని శివాజీ హెచ్చరించినట్లుగా మాట్లాడాడు.

తర్వాత కంటెస్టెంట్స్ మధ్య ఇంటి పనుల విషయం డిస్కషన్‌కు వచ్చింది. రెండు రోజుల పాటు శోభా, ప్రియాంకలు వంట చయాలని.. మిగిలిన పనులు తాము చూసుకుంటామని అమర్‌తో అర్జున్ అన్నాడు. ఈ విషయం ప్రియాంక, శోభల దగ్గర ప్రస్తావించగా.. మేం చేయమని వారు తేల్చిచెప్పేశారు. అమర్ సైతం నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా వినలేదు.. చివరికి ఎలాగోలా ఒప్పుకున్నారు. అనంతరం అమర్‌ అన్నకి నేనంటే ఎందుకు కోపం అన్నా అని శివాజీని ప్రశాంత్ అడిగాడు. అది కోపం కాదు రా భయం అని పెద్దన్న చెప్పాడు. వాడు (అమర్) కెప్టెన్ ఏంటిరా .. కెప్టెన్ ఆర్డర్ వేయాలి కానీ, ఆర్డర్లు తీసుకోకూడదు, వాళ్లకి టిఫిన్లు తీసుకెళ్లి అందిస్తున్నాడని శివాజీ అసహనం చేశాడు. ఇక రేపు శనివారం కావడంతో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ వారం కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్, వాళ్ల తప్పులను నాగ్ విశ్లేషించనున్నారు. అలాగే గ్రాండ్ ఫినాలే గురించి ఆసక్తికర విషయాలను కూడా ఆయన పంచుకునే అవకాశం వుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.