close
Choose your channels

Pawan Kalyan:నాదెండ్ల అరెస్ట్‌ను ఖండించిన పవన్ కల్యాణ్.. విశాఖ వస్తానని హెచ్చరిక..

Monday, December 11, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విశాఖపట్టణంలో జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నగరంలో టైకూన్ జంక్షన్ మూసివేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంటే ఆ కూడలిని తెరవాలని నిరసన చేస్తున్న మనోహర్‌ను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని పవన్ మండిపడ్డారు. ప్రజలకున్న సమస్యలను తీర్చాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసులు అధికారులు ఇందుకు భిన్నంగా స్థానిక ఎంపీ కోసం జంక్షన్ మూసివేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆయన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకి వాస్తు దోషం ఉందని రోడ్డు మూసి వేయడం ఏమిటని ధ్వజమెత్తారు.

దీనిని ప్రజా గొంతుకగా జనసేన వినిపిస్తోందని అందులో భాగంగా ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపాలని మనోహర్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, వీర మహిళలు సన్నద్ధమైతే పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు మనోహర్‌తో పాటు ఇతర జనసేన నేతలను తక్షణమే విడుదల చేయాలని.. ఇదే ధోరణిలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తే విశాఖపట్నం బయలుదేరి వచ్చి ప్రజల తరఫున పోరాడతానని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

విశాఖలోని టైకూన్‌ కూడలి నుంచి వీఐపీ రోడ్డు వైపు వెళ్లే మార్గాన్ని మూసివేయడంపై జనసేన ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు చేపట్టారు. వీరికి నోవాటెల్‌ హోటల్‌ వద్ద నాదెండ్ల కూడా నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతిపక్ష నేతలకు లేదా అని ప్రశ్నించారు.

వీఐపీ రోడ్డు వైపు వెళ్లే మార్గాన్ని మూసివేయడం వల్ల ప్రయాణికులు సుమారు 2 కిలోమీటర్ల మేర అదనపు దూరం వెళ్లాల్సి వస్తుందన్నారు. విశాఖ ఎంపీ నిర్మిస్తున్న బిల్డింగ్ సేల్స్ పెంచుకోవడం కోసం ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్నారని విమర్శించారు. డివైడర్ తొలిగించే వరకు జనసేన పోరాడుతుందని ప్రకటించారు. పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నామని.. వైసీపీ నేతల ట్రాప్‌లో పడొద్దని సూచించారు. రూల్స్ బ్రేక్ చేసిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నాదెండ్ల హెచ్చరించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos