close
Choose your channels

Director Shankar : శంకర్ వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ లో హీరో ఎవరంటే ?

Friday, November 18, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Director Shankar : శంకర్ వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ లో హీరో ఎవరంటే ?

తమిళ దర్శక దిగ్గజం శంకర్ మరో భారీ సినిమాకు తెరదీశారు. సు వెంకటేశన్ రచించిన ‘వేల్పారి’ నవల ఆధారంగా ఓ చారిత్మాక సినిమాను ఆయన తెరకెక్కించనున్నారు. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో.. మూడు భాగాలుగా ఈ సినిమాను నిర్మించనున్నారని కోలీవుడ్ టాక్. ఈ చిత్రంలో సూర్య లీడ్ రోల్‌ పోషిస్తారని.. కేజీఎఫ్ స్టార్ యష్, బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌లు కీలక పాత్రలు పోషిస్తారని ప్రచారం జరుగుతోంది.

డేట్స్ సర్దుబాటు చేయలేకపోయిన విజయ్:

అయితే ఈ ప్రాజెక్ట్‌లో శంకర్ తొలుత హీరోగా అనుకున్నది ఇళయ దళపతి విజయ్ అని వార్తలు వస్తున్నాయి. కొద్దినెలల క్రితమే ఆయనకు శంకర్ కథను వినిపించగా, దీనికి విజయ్ అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తోంది. అనంతరం చిత్ర నిర్మాత ఈ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్‌కి అప్పగించారు. కానీ అది పట్టాలెక్కలేదు. ఇదే సమయంలో విజయ్ తన ‘‘దళపతి 67’’, ‘‘దళపతి 68’’ సినిమాలకు కమిట్‌మెంట్ ఇచ్చిన నేపథ్యంలో శంకర్ ప్రాజెక్ట్‌కు డేట్స్ సర్దుబాటు చేయలేకపోయాడు.

Director Shankar : శంకర్ వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ లో హీరో ఎవరంటే ?

విజయ్ తండ్రి వద్దే శంకర్ దర్శకత్వ పాఠాలు:

కాగా.. శంకర్‌కు విజయ్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న సంగతి తెలిసిందే. శంకర్ స్టార్ దర్శకుడు కాకముందు విజయ్ తండ్రి, దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. 2012లో శంకర్ దర్శకత్వంలో హిందీ ‘‘త్రీ ఇడియట్స్ ’’ రీమేక్ ‘‘నన్బన్’’ (తెలుగులో స్నేహితుడు)లో విజయ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే.

రామ్‌చరణ్ ప్రాజెక్ట్‌తో శంకర్ బిజీ:

మరోవైపు.. శంకర్ - మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ల కాంబినేషన్‌లో ‘‘ఆర్సీ 15’’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దిల్‌రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. చాలా వరకు షూటింగ్‌ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశం వుంది. అటు శంకర్ - కమల్ హాసన్‌ల డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భారతీయుడు - 2 ’’ కూడా త్వరలో పట్టాలెక్కే అవకాశం వుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.