close
Choose your channels

మాట నిలబెట్టుకున్న కింగ్ నాగార్జున.. వెయ్యి ఎకరాల అటవీ భూమి దత్తత

Thursday, February 17, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మాట నిలబెట్టుకున్న కింగ్ నాగార్జున.. వెయ్యి ఎకరాల అటవీ భూమి దత్తత

అగ్ర కథానాయకుడు, కింగ్ నాగార్జున తన మాట నిలబెట్టుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో 1,080 ఎకరాల అటవీ భూమిని ద‌త్త‌త తీసుకుంటున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ నగర శివారు చెంగిచర్ల అటవీ బ్లాక్ పరిధిలో తన తండ్రి, దివంగత అక్కినేని నాగేశ్వర రావు పేరు మీద అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు నాగ్ ముందుకు వచ్చారు. గురువారం ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్‌‌తో కలిసి చెంగిచర్లలో ఈ మేరకు శంకుస్థాపన చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో నాగార్జున సతీమణి అమల, కుమారులు నాగ చైతన్య, నిఖిల్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అటవీ పార్కు అభివృద్దికి ముఖ్యమంత్రి సంకల్పించిన గ్రీన్ ఫండ్ నిమిత్తం రెండు కోట్ల రూపాయల చెక్ ను నాగ్ అటవీ శాఖ ఉన్నతాధికారులకు అందించారు.

మాట నిలబెట్టుకున్న కింగ్ నాగార్జున.. వెయ్యి ఎకరాల అటవీ భూమి దత్తత

ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ.. మన పరిసరాలు, రాష్ట్రం, దేశం కూడా పచ్చగా, పర్యావరణ హితంగా మారాలన్న సంకల్పంతో సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొని పలుసార్లు మొక్కలు నాటినట్లు గుర్తుచేశారు. బిగ్‌బాస్ 5 సీజన్ ఫైనల్ కార్యక్రమం సందర్భంగా అడవి దత్తతపై సంతోష్ చర్చించానని.. ఆ రోజే వేదికపై ప్రకటించినట్లుగానే ఇప్పుడు అటవీ పునరుద్దరణ, అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తున్నట్లు నాగార్జున అన్నారు. ఈ అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న కాలనీ వాసులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

మాట నిలబెట్టుకున్న కింగ్ నాగార్జున.. వెయ్యి ఎకరాల అటవీ భూమి దత్తత

ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా అడవి దత్తతకు నాగార్జున ముందుకు రావటాన్ని ప్రశంసించారు. చెంగిచర్ల ఫారెస్ట్ బ్లాక్‌లో దివంగత అక్కినేని నాగేశ్వర రావు పేరుపై అర్బన్ పార్కు అభివృద్దితో పాటు, ఖాళీ ప్రదేశాల్లో దశల వారీగా లక్ష మొక్కలను నాటే కార్యక్రమాన్ని నేటి నుంచే ప్రారంభించినట్లు ఎంపీ వెల్లడించారు. దేశంలో ఏ పెద్ద నగరానికి లేని ప్రకృతి సౌలభ్యత ఒక్క హైదరాబాద్‌కే ఉందని.. రాజధాని చుట్టూ ఉన్న లక్షా యాభై వేల ఎకరాలకు పైగా అటవీ భూమిని పరిరక్షించటం, పునరుద్దరణ చేయటం, అర్బన్ పార్కుల ఏర్పాటుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఇందు కోసం సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చే ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.